రేవంత్ ను రాహుల్ వద్దకు తీసుకెళ్లింది అతనేనట



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో నెలకున్న సందిగ్దత ఇంకా తొలగలేదు. తాను పార్టీ మారేది లేదని మీడియాతో చెప్పాడు. ఫలితంగా అతని పై చర్య తీసుకోవాలా లేదా అనే విషయంలో టీడీపీ ఒక నిర్ణయానికి రాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే విషయం పై చర్చించేందుకు ఈనెల 26న టీడీఎల్పీ సమావేశం అవుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫలితంగా అతను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు లేదు. ఏదైనా సీ.ఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఈనెల 27న రానున్నారు. దానికి ముందే టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అప్పటి వరకు రేవంత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరనే వాదనుంది. 
                 మరోవైపు ఎ.ఐ.సి.సి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి నేరుగా కలిశారు. పి.సి.సి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ సంగతి తెలియదట. కాకపోతే పార్టీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ను హస్తినకు పిలిపించి మాట్లాడారట రాహుల్ గాంధీ. అసలు రాహుల్ వద్దకు ఎవరు తీసుకెళ్లారు.. ఏంటనే విషయం పై క్లారిటీ వచ్చింది. రేవంత్ ను రాహుల్ వద్దకు తీసుకెళ్లింది మాజీ ఐ.ఎ.ఎస్ అధికారి కె.రాజు అట. తెలంగాణ రాజకీయాలు, రేవంత్ దూకుడు మొదలైన అన్ని విషయాలను పరిశీలించిన ఆయన విషయాన్ని నేరుగా రాహుల్ దృష్టికి తీసుకెళ్లారట. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని హస్తినకు పిలిపించారు వాళ్లు. ఇతరులకు అనుమానం రాకుండా రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిశారట. అంతా రహస్యంగానే జరిగింది. కాకపోతే రాహుల్ ను కలిసిన తర్వాతనే మీడియాకు విషయం తెలిసింది.
         దానికి ముందే రాహుల్ ను కలవడం వివిధ అంశాల పై చర్చించడం జరిగిపోయాయని తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇందుకు తెరవెనుక పాత్ర నిర్వహించారని తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*