జగన్ పాదయాత్రపై నేడు తీర్పు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయనున్నాడు వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి. ఆరు నెలల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా 3 వేల కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు జగన్ సిద్దమయ్యాడు. అక్టోబర్ 27న జగన్ పాదయాత్ర ఇడుపుల పాయలో మొదలు పెడతారని మొదట ప్రకటించారు. కానీ అది కాస్త నవంబర్2 కు వాయిదా పడింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 8న ప్రారంభం కానున్నాయి. 13వ తేది వరకు జరగనున్నాయి. దీంతో పాదయాత్ర ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు నెలకున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ జగన్ విచారణ ఎదుర్కుంటున్నాడు. దీంతో  ఆరోజు యాత్రప్రారంభం కావడం కష్టమనే వాదనుంది. 
ఆదాయానికి మించిన ఆస్తులు…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన జగన్ ను ఇప్పుడు ఈడీ కేసు వెంటాడుతోంది. ఈ కేసులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు జగన్ హాజరుకావాల్సి ఉంది. ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో ఈ సమన్లు జారీ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. జగన్ తో పాటు… వైసీపీ ఎంపీ, ఆడిటర్ విజయసాయి రెడ్డి, ఇండియా సిమెంట్స్ ఛైర్మన్ శ్రీనివాసన్‌ల‌కు ఈడీ సమన్లు పంపింది. మనీల్యాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం ఈడీ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరితో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, మరో అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ల‌ు విచారణకు హాజరవుతున్నారు. 
                     జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల‌కు ఇండియా సిమెంట్స్ నుంచి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీబీఐ గుర్తించింది. అందుకే ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని భావించి సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ పెట్టుబడుల కోసం ఇండియా సిమెంట్స్ కు కడప జిల్లాలో భూమితో పాటుగా కృష్ణా నది నీటిని కేటాయించిన వైనాన్ని సీబీఐ తన దర్యాప్తులో కనుగొంది. అందుకే ఆగస్టు 4వ తేదీన జగన్ తోపాటు విజయసాయి రెడ్డి, శ్రీనివాసన్ లు కూడా సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. దీనిపై పలు ప్రశ్నలను కోర్టు అడగనుంది. 
రాజకీయ కారణాలు వద్దన్న కోర్టు
గుంటూరులో పార్టీ ప్లీనరీ కోసం కోర్టు అనుమతి కోరారు జగన్ పక్ష న్యాయవాది. పార్టీ కార్యక్రమం కావండతో ఆయన్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సి.బి.ఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో కోర్టుకు గైర్హాజరు కాకపోవడం సరికాదని చెప్పింది. ఇప్పుడే కాదు.. రానున్న కాలంలో ఇలాంటి కారణాలు చెప్పి కోర్టుకు హాజరుకాకపోతే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని ఘాటుగానే హెచ్చరించింది. అదే సమయంలో కేసు విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
                         అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో జగన్ పాదయాత్ర ప్రారంభం కావడం డోలాయమానంలో పడింది. ఇందుకు కోర్టు అనుమతించేది అనుమానంగానే చెబుతున్నారు. తీర్పును రిజర్వ్ చేయడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకుంది. అయినా యాత్ర చేసి తీరుతానంటున్న తీరు ఆసక్తికరమే.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*