జగన్ కు సిబిఐ కోర్టులో చుక్కెదురు…



Want create site? Find Free WordPress Themes and plugins.

      వైకాపా అధినేత జగన్మోహనరెడ్డికి సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఏపీలో నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేసేందుకు అనుమతించాలని కోరారు జగన్. ఇందుకు మినహాయింపు నివ్వాలని జగన్ కోర్టు గడప తొక్కారు. జగన్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రైతు ఆత్మహత్యలు, బడుగు, బలహీనవర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 3 వేల కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం వల్ల పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి ఉంటుందని ప్రస్తావించారు. దీని వల్ల సమస్యలపై చేస్తున్న ఆ పాదయాత్ర ప్రభావంలో తీవ్రత తగ్గుతుందన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 కింద వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసిందని, హాజరు మినహాయింపు ఇచ్చే విచక్షణాధికారం ఇదే కోర్టుకు ఉందని చెప్పింది. హైకోర్టు కొట్టివేసినందున సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద పిటిషన్‌ దాఖలు చేయకూడదన్న నిబంధన ఏమీలేదన్నారు. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక్క శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీని వల్ల కొంత విశ్రాంతి కూడా దొరుకుతుందని కోర్టు చెప్పింది. వ్య‌క్తిగ‌త హాజ‌రు మినహాయింపు ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేస్తూ పిటిష‌న్ కొట్టివేసింది. 

        రాజకీయ కారణాలతో జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పింది కోర్టు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు 317 కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పింది.  సిబిఐ కోర్టు తీర్పు పైనా హైకోర్టుకు వెళ్లి మరింతగా తమ వాదన వినిపించే పని చేయనున్నారు జగన్. ఆరు నెలల పాటు కోర్టుకు హాజరు కావాలనే నిబంధనకు మినహాయింపునిచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరనున్నారు. ఫలితంగా మరోసారి ఉత్కంఠ నెలకుంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*