విజయవాడ వైసీపీ ఆఫీసు మొక్కుబడి పర్వమేనా?



Want create site? Find Free WordPress Themes and plugins.

వచ్చే నెల 8వ తేదీనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పాలక – ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలను కొన్ని రోజుల ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నిజానికి ప్రతిపక్షానికి పని ఎక్కువ. ప్రభుత్వంలో పాలనలో ఎలాంటి లోపాలు దొర్లుతున్నాయో.. అన్నిటినీ ప్రస్తావించి.. పరిష్కారం కనుగొనే ప్రయత్నం, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రిపేర్ కావడం గురించి ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కానీ దానిని హైదరాబాదు లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్.. తన పార్టీ వ్యవహారాలు మొత్తం పొరుగు రాష్ట్రం నుండి నడిపిస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శించే తీరులోనే ఆయన మళ్లీ ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రతి సమావేశమూ లోటస్ పాండ్ లోనే నిర్వహించేట్లయితే అసలు విజయవాడలో ఆఫీసును ఎందుకు ప్రారంభించినట్లు? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి.. పరిపాలన, యంత్రాంగం మొత్తం ఆ గడ్డ మీదకే తరలిపోయినప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తన కార్యకలాపాలన్నీ హైదరాబాదునుంచే సాగిస్తున్నారు. ఆయన నివాసం సరే, చివరికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీకి ప్రధాన ఆఫీసు కూడా హైదరాబాదులోనే. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే.. ఇలాంటి పోకడ ఆయనకు అనేక విమర్శలను తెచ్చిపెడుతోంది. పక్క రాష్ట్రంలో తిష్టవేసి, అక్కడినుంచేఅన్ని పనులూ నడిపించే నాయకుడు.. ఇక్కడి ప్రజలకు ఏం చేయగలడంటూ.. తెదేపా వారు పలువురు విమర్శిస్తూ ఉంటారు. వాటికి దీటుగా జవాబివ్వడానికి అన్నట్లుగా వైఎస్ జగన్, విజయవాడలో రాష్ట్ర  పార్టీ కార్యాలయాన్ని చాలా ఘనంగా ఏర్పాటుచేశారు. ఆయనకు ఖాళీ దొరకగపోగా, ఆ ఆఫీసును ఇతర నాయకులు ప్రారంభించారు కూడా. అయితే ఇప్పటికీ ఆ ఆఫీసు మొక్కుబడిగానే పెట్టారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆఫీసు ఉందే తప్ప.. కీలక నాయకులు అక్కడకు వచ్చి భేటీలు సమావేశాలు నిర్వహించే  పరిస్థితి మాత్రం లేదు. అధినేత కూడా అక్కడ ఉండరు. చివరకు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలను సిద్ధం చేసే సమావేశం అయినా అక్కడ పెట్టుకుని ఉంటే బాగుండేదని కొందరు సూచించినప్పటికీ, విజయవాడ వెళ్లే మూడ్ లేక జగన్ హైదరాబాదులోనే పెట్టినట్టు సమాచారం. పొరుగురాష్ట్రంలో వ్యూహరచన చేసుకుని, ఇక్కడికొచ్చి రాజకీయాలు చేస్తారా.. రాష్ట్రం మీద మీకున్న శ్రద్ధ ఏపాటిదో తెలిసిపోతూనే ఉంది అని తెలుగుదేశం వారు విమర్శిస్తే గనుక.. మాటలు వెతుక్కోవడం తప్ప జగన్ ఎలా సమాధానం చెబుతారు? సొంత పార్టీ ఆఫీసు కూడా ఏర్పాటయ్యాక జగన్ కు ఇలాంటి వైఖరి తగదని పలువురు అంటున్నారు. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*