మాజీ మంత్రి శ్రీధర్ బాబు పై కేసు



Want create site? Find Free WordPress Themes and plugins.
          మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడనేది ఆరోపణ. శ్రీధర్‌బాబు, కిషన్‌రెడ్డిల మధ్య కొన్నాళ్లుగా వివాదం రేగుతోంది. ఇప్పటికే శ్రీధర్‌బాబు అనుచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ వ్యవహారంలో శ్రీధర్ బాబు పాత్రపైనా విచారణ సాగుతోంది. శ్రీధర్‌బాబు మంత్రిగా కొనసాగిన సమయంలో ముత్తారం గ్రామాభివృద్ధి కోసం 9 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. కానీ ఆ స్థలాన్ని శ్రీధర్‌బాబు కాజేసేందుకు యత్నిస్తున్నాడనేది కిషన్‌రెడ్డి ఆరోపణ. అందుకే ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాను..ఫలితంగా నాపై శ్రీధర్‌బాబు కక్ష పెంచుకున్నారు. తన పై ముత్తారం మాజీ సర్పంచ్ సుదర్శన్‌ను ఉసిగొల్పారనేది కిషన్ రెడ్డి చేస్తున్న వాదన. వినాయకచవితి రోజు కిషన్‌రెడ్డిపై కేసులు పెట్టేందుకు కుట్రపన్నారు. గంజాయి కేసులో ఇరికించాలని పథకరచన చేశారు. 
          కిషన్‌రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టే పనిని భార్గవ్ అనే వ్యక్తికి అప్పగించారట సుదర్శన్. డబ్బులు తీసుకున్న భార్గవ్ కిషన్‌రెడ్డి ఇంట్లో గంజాయి ప్యాకెట్లు ఉంచాడు. ఆ తర్వాత సుదర్శన్, భార్గవ్ మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితంగా ఈ కుట్ర మొత్తం బయటపడింది. సినీ పక్కీలో ఉందా సంఘటన. అందుకే కిషన్‌రెడ్డి ఫిర్యాదు తీసుకున్న హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. దోమల్‌గూడలోని శ్రీధర్‌బాబు ఇంట్లోనే ప్లాన్ గీశారని కంప్లైంట్ చేశాడు కిషన్ రెడ్డి. ఇప్పుడు శ్రీధర్ బాబుపై ఎన్ డిపిఎస్ యాక్ట్‌ 28, రెడ్‌ విత్‌ 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
        తన పై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదంటున్నారు మరోవైపు శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ సర్కారును ఎదిరించే నేతల పై కేసులు పెట్టడం చాలా సాధారణ విషయం అన్నారు. అందుకే ఈకేసులను పట్టించుకునేది లేదని తేల్చి చెప్పారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*