భూమి నుండి వింత శబ్దాలు..భయం నీడలో భాగ్యనగర వాసులు



Want create site? Find Free WordPress Themes and plugins.
        భూమి నుండి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. ఐదారు సెకన్ల పాటు ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. అంతే గాఢ నిద్రలో ఉన్న వారికి మెలకువ వచ్చింది. మట్టి గోడలకు బీటలు వచ్చాయి. ఫలితంగా జనాలు ఇళ్లల్లోనుండి లేచి పరుగులు తీశారు. వామ్మో భూకంపం వచ్చిందని హాహాకారాలు చేశారు. హైదరాబాద్ రహ్మత్‌నగర్‌లోని ఎస్పీఆర్‌హిల్స్‌ బస్తీలో జరిగిందా సంఘటన. రెండు రోజుల పాటు ఇలానే శబ్దాలు రావడంతో బిక్కు బిక్కు మంటూ వారు కాలం వెళ్లదీస్తున్నారు. తెల్లవారు జూమున 3 గంటలకు, ఉదయం 10 గంటలకు ఎస్పీఆర్‌హిల్స్‌లోని హెచ్‌ఎఫ్‌నగర్‌, ఇందిరానగర్‌, బాబాషైలానీనగర్‌, హనుమాన్‌ స్టోన్‌ కట్టర్స్‌ ప్రాంతాల్లో భూమి నుంచి ఇలా శబ్దం వచ్చింది. 
        ఆ శబ్ధం కొన్ని సెకన్లపాటు రావడంతో భూకంపం వచ్చిందని పుకార్లు వ్యాపించాయి. అంతే జనాలంతా జాగారం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఒకటే మెసేజ్ లు. హైదరాబాద్ నగరం అంతా అప్రమత్తంగా ఉండాలని..భూకంపం వస్తుందనే పుకార్లు షికారు చేశాయి. రంగంలోకి దిగిన పోలీసులు  శబ్దం వచ్చిన ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి వస్తువులు లేవు. భూ కంపతీవ్రత అక్కడ కనపడలేదు. కానీ ఎందుకు శబ్దం వచ్చిందో ఎవరికీ అర్థం కావడంలేదు. 
      ఖైరతాబాద్‌ మండల తహసీల్దారు సైదులు, ఆర్‌ఐ మల్లికార్జున్‌, వీఆర్‌ఓ శేఖర్‌ల బృందం బస్తీల్లో పర్యటించింది. ఇప్పుడే కాదు…వారం రోజులుగా అప్పుడప్పుడు ఇలానే శబ్దాలు వస్తున్నాయని చెప్పారు అంతా. అందుకే మట్టి గోడలకు బీటలు వచ్చాయని మహిళలు అధికారులకు చెప్పారు. . గుట్టలపై ఉన్న బస్తీల్లో మాత్రమే శబ్దాలు వస్తున్నాయని తేలింది. అంతే భూభౌతిక శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. రెండు బృందాలుగా ఏర్పడి శబ్ద తరంగాలను నమోదు చేసేందుకు పరికరాలు అమర్చారు. శాస్త్రవేత్త నాగేశ్వర్‌ పరిసరాలను పరిశీలించి ఒక నిర్థారణకు వచ్చారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గుట్టల్లోని పొరల్లో నీరు చేరింది. ఫలింతంగా అవి పొరలు సర్దుబాటు చేసుకునే క్రమంలో అప్పుడప్పుడు శబ్దాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయినా పూర్తిగా తిరిగి పరిశీలించిన తర్వాత వాస్తవాలు చెబుతానని వెల్లడించారు. 
       విషయం ఏదైనా ఇప్పుడు చాలా మంది బస్తీ వాసులు తమ ఇళ్లను ఖాళీ చేసి..తెలిసిన వారి ఇళ్లకు..బంధువుల వద్దకు వెళుతున్నారు. వారం రోజులు చూశాక ఇక్కడకు వస్తామని చెబుతున్నారు. 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*