జడ్చర్ల నుంచి రేవంత్ రెడ్డి పోటీ



Want create site? Find Free WordPress Themes and plugins.
          వచ్చే శాసనసభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మారుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరుతున్న రేవంత్ రెడ్డి ఈ సారి పాలమూరు జిల్లా జడ్చర్ల నుంచి పోటీచేయాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే జడ్చర్ల నేతలు రేవంత్ రెడ్డిని కలిసి తమ నియోజవర్గానికి రావాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల కు మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ కు బలమైన కేంద్రంగా ఉంది  జడ్చర్ల. మాజీ విప్ మల్లు రవి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఆయనను తప్పించి రేవంత్ కు టికెట్ ఇవ్వాల్సి ఉంటోంది. కానీ మల్లు రవి మాత్రం తనకు జడ్చర్ల సీటు కావాలని పట్టుబడుతున్నారట. కానీ అక్కడ సామాజికవర్గాల నేపధ్యంలో రేవంత్ వైపు కొందరు నేతలు మొగ్గు చూపుతున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ చేరిక ఏమోగానీ..కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తనతో పాటు..కొంత మంది నేతలను టీడీపీ నుంచి బయటకు తీసుకువస్తున్నారాయన. ఫలితంగా తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారట. అందుకే కొందరు అప్పుడే రేవంత్ రెడ్డి పైనా ఫిర్యాదులు చేస్తున్నారట.
  
         మరోవైపు మంత్రి లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి పోటీ పై స్పందించాడు. రేవంత్ రెడ్డి స్థానికుడు కాదు. గతంలో కల్వకుర్తిలో పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావునే ప్రజలు ఓడించారు. రేవంత్ ఎంత అని వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లు టిఆర్ఎస్ దే అధికారం. అయినా ఎక్కడ పోటీ చేసినా గెలుపు మాదేనంటున్నారు లక్ష్మారెడ్డి. కొడంగల్ టీడీపీ నేతలు చాలా మంది ఆ పార్టీని వీడారు. గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.అందుకే రేవంత్ రెడ్డి తన సీటును మారేందుకు సిద్దమైనట్లు సమాచారం
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*