పార్టీ మారడం లేదన్న రేవంత్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన రేవంత్ వారితో తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పేదల కోసం పోరాడి తాను గుర్తింపు తెచ్చుకున్నానని ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమెరికాలో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. ఆయనకు ఇబ్బంది కలిగించే పని తాను చేసేది లేదని చెప్పారు. మా పార్టీ నాయకులపై వస్తున్న వార్తలు.. కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయని చెప్పారు ఆయన. నాలుగు రోజులుగా మౌనంగా ఉన్న రేవంత్ తొలిసారిగా నోరు విప్పారు. 
                       ఈనెల 27 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఫలితంగా తాము ఏం చేయాలనే అంశంపై ఈ నెల 26న టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం నిజం కాదన్నారాయన. కానీ ఆయన మాటల్లో క్లారిటీ లేదన్నారు మరోవైపు తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ. తమ పార్టీలో ఉంటూ మిగతా పార్టీల నేతలను కలిసి వారి పై ఫిర్యాదు చేయనున్నట్లు రమణ చెప్పడం ఆసక్తికరమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*