రాహుల్ గాంధీకి పట్టాభిషేకం



Want create site? Find Free WordPress Themes and plugins.
         అప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారు. వాయిదా పడూతూనే ఉంది. చివరకు అందరూ అనుకున్నదే జరిగింది. రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు యూపీఏ అధినేత్రి సోనియా  రంగం సిద్దం చేస్తున్నారు. ఎట్టకేలకు రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నేతల వినతి మేరకు సోనియా నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24న రాహులుడికి పట్టాభిషేకం చేయనున్నారు. కాంగ్రెస్‌ యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. సిడబ్య్లుసి భేటీలో రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఫలితంగా అసలు లాంఛనం పూర్తి కానుంది. ఇక మీదట పార్టీ పాలన వ్యవహారాలను రాహుల్ చూడనున్నారు. యువ రక్తంతో పార్టీని నింపనున్నారు.  
        కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంతకు ముందులా దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. చాలాకాలంగా అనారోగ్యం ఆమెను ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్లమెంటులో చురుకైన పాత్ర పోషించలేకపోతున్నారు. అందుకే నాయకత్వ మార్పు ఉండాలనే వాదనలు ఊపందుకున్నాయి. ఫలితంగా రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
     ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కావాల్సినంత అనుభవం సంపాదించాడు. రాహుల్ గాంధీకి  పార్టీ బాధ్యతలు అప్పగించాలని సీనియర్లు.. సోనియాకు చాలా కాలం నుంచే చెబుతూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పూర్తిగా ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాలన్న భావనతోనే అన్ని రాష్ట్రాల పిసిసిల అభిప్రాయాన్ని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఉన్న పరిస్థితుల్లో  రాహుల్‌ గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారు ఎవరూలేరు. రాహుల్ నాయకత్వంలోనే ముందుకెళ్లాలన్నది అందరి అభిప్రాయంగా ఉంది. 
 
        రాహుల్‌కు మద్ధతుగా వివిధ రాష్ట్రాలు తమ తీర్మానాలు పంపాయి. ఫలితంగా పార్టీ అధ్యక్ష పీఠాన్ని రాహుల్‌ అధిష్టించడం ఖాయమైంది. ఇక మిగిలిన లాంఛనాలు పూర్తి చేసేందుకు సీనియర్లంతా సోనియా నివాసంలో భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*