ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఒకే వేదిక పై



Want create site? Find Free WordPress Themes and plugins.
          యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటు పెద్ద తెర, అటు బుల్లితెర మీద రాణిస్తున్నాడు. అంచనాలను అందుకుంటున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తాజాగా జై లవకుశ మూవీ సక్సెస్ ఎన్టీఆర్ ను మంచి జోష్ లో నింపుతోంది. ఇప్పుడు త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ సినిమా ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే ఈ ప్రారంభోత్సవానికి అనుకోని అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నారు. నందమూరి సినిమా ప్రారంభోత్సవానికి మెగా కుటుంబం నుంచి అతిథి రావడం మాములు విషయం కాదు. అందులోను ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారుతున్న సమయంలో జనసేన అధినేత రానుండటం ఆసక్తికరమే.  
        హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 జనవరి నుంచి ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, పవర్ స్టార్ ఇద్దరు ఒకే వేదికమీద కనపడటం ఫ్యాన్స్ కి పండగే పండుగ. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*