కాంగ్రెస్‌కు తెరాస సంకేతం : రేవంత్ తో నో యూజ్!



Want create site? Find Free WordPress Themes and plugins.

తెలుగుదేశం పార్టీనుంచి కీలకనాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తమలో కలిపేసుకుంటే.. తమ పార్టీ చాలా బలోపేతం అవుతుందని, రెట్టించిన శక్తితో తెరాసను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మార్గం ఈజీ అవుతుందని తెలంగాణలో కాంగ్రెస్ భావిస్తుండవచ్చు. ఎంట్రీ సమయంలోనే రాష్ట్రస్థాయి కీలక పదవి ఇస్తామంటూ ఆశచూపించడం, సీఎం ప్రాబబుల్స్ గా కూడా పరిశీలిస్తామని హామీ ఇవ్వడం ఇలాంటివన్నీ.. ఇందుకు సంకేతాలే. అయితే రేవంత్ రెడ్డి వచ్చి చేరినంత మాత్రాన.. తెలంగాణ తెలుగుదేశానికి ఉన్న బలంలో కొంతైనా.. కాంగ్రెస్ లోకి వచ్చి కలుస్తుందా? లేదా? తనతో పాటూ కేడర్ ను పార్టీ మారేలా ప్రేరేపించగల శక్తి రేవంత్ కు ఉన్నదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అందుకే ఈ విషయంలో అధికార పార్టీ తెరాస.. కాంగ్రెస్ కు కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇవ్వదలచుకున్నట్లుగా ఉంది.

రేవంత్ రెడ్డి కి కేడర్ మీద ఉన్న అసలు పట్టు ఎంతో కాంగ్రెస్ కు తెలియజెప్పడానికా అన్నట్లుగా ఈ పరిణామం ఉంది. ఇంతకూ ఏం జరిగిందంటే.. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు శుక్రవారం నాడు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఒకవైపు తమ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో అదే పార్టీకి చెందిన లోకల్ లీడర్లు తెరాసలో చేరడంతో.. రేవంత్ కు గాలితీసినట్టు అవుతుందని తెరాస వ్యూహం.

మరోవైపు తెలుగుదేశం పార్టీ మహబూబ్ నగర్ జిల్లా పార్టీ సమావేశం నిర్వహించి.. రేవంత్ పోక వల్ల నష్టం ఉండదనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఈ సమావేశానికి కొడంగల్ కు చెందిన తెదేపా నాయకులు రాకపోవడం గమనార్హం. అంటే రేవంత్ వెళ్లిపోయినంత మాత్రాన.. ఆయనను నమ్మిన తెదేపా కేడర్ మొత్తం కాంగ్రెస్ లోకి వెళ్లకపోవచ్చునని, కార్యకర్తలు ఎవరి స్వలాభం వారు చూసుకుంటూ.. చాలా మంది అధికార పార్టీ వైపు కూడా మొగ్గవచ్చునని సమాచారం అందుతోంది.

మరి ఇలాంటి పరిణామాలను కాంగ్రెస్ గమనిస్తూనే ఉంటుందా? రేవంత్ వల్ల వారు ఆశించిన ప్రయోజనం దక్కుతుందో లేదో అనే సందేహాలు వారికి కలగకుండా ఉంటాయా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కాంగ్రెస్ పరిస్థితి అంత దివ్యంగా ఏమీ లేదు. రేవంత్ వెంట తెదేపా కేడర్ మొత్తం రాకపోయినా పర్లేదు.. కొందరు వచ్చినా చాలు.. తమ పార్టీ తరఫున కేసీఆర్ మీద మడమ తిప్పకుండా పోరాడగల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ధైర్యంగా సూటిగా గళమెత్తగల నాయకుడు ఒకడుంటే చాలు అని కాంగ్రెస్ భావిస్తోంటే గనుక.. రేవంత్ కు ఢోకా ఉండక పోవచ్చు. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*