వాల్ స్ట్రీట్ జర్నల్ లో అమరావతి, చంద్రబాబు ప్రస్తావన



Want create site? Find Free WordPress Themes and plugins.
         ఆంధ్రుల నగరి అమరావతి రాజధాని నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక పాత్ర రాజధానిదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ వ్యాప్తంగా ..అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమరావతి పేరును కలవరిస్తున్నారు. అదే అంశం పై వ్యాసాలకు వ్యాసాలు, కథనాలకు కథనాలే వస్తున్నాయి. సి.ఎం చంద్రబాబునాయుడు అమరావతిని భారత దేశంలోనే స్మార్ట్ సిటీగా రూపొందిస్తున్నారని కితాబునిస్తు కథనాలు రావడం కొత్తకాదు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ది డైలీ న్యూస్ పేపర్, వాల్ స్ట్రీట్ జర్నల్ లు చేరాయి. అమరావతి – India’s first “smart city”, “చంద్రబాబు నాయుడు – The visionary” అన్న వ్యాఖ్యలు ఆ పత్రికల్లో వచ్చాయి. అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. “నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తెలుగు ప్రజలే కాక దేశం మొత్తం గర్వించేలా, 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నారని, ఓ డైనమిక్‌ సిటీగా చంద్రబాబు నాయుడు దాన్ని నిర్మిస్తున్నారని” ప్రస్తావించింది.
        పాలనా అనుభవం ఉన్న నేతగా…చంద్రబాబునాయుడును 2014 ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని…అందుకే ఆయన మాటలు నమ్మి రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని ప్రస్తావించారు ఆ కథనంలో. ప్రభుత్వానికి భూములు ఇవ్వడమే కాదు…దానికి ప్రతి ఫలంగా, రైతులకి అభివృద్ధి చేసి, ఫ్లాట్లు ఇవ్వనున్నారని చెప్పింది. ఇది రైతులకి ఎంతో ప్రయోజనం. రైతులు కూడా మా జీవితాలు బాగుపడతాయని సంతోషంగా ఉన్నారని ఆ వ్యాసంలో ప్రస్తావించింది. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణాలాను వరల్డ్ క్లాస్ గా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పింది. సింగపూర్, జపాన్, లండన్, చైనా పెట్టుబడులను ఆ కథనంలో రాసింది. హైపర్ లూప్ టెక్నాలజీ కూడా అమరావతి లో వాడుతున్న విషయం రాయడం విశేషం. చంద్రబాబు బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతిని ఎలా తీర్చిదిద్దుతున్నారో అర్థమవుతోంది. ఆర్థికాభివృద్ధి, నివాసయోగ్య నగరం, కనెక్టివిటీ, యాక్టివ్‌ మొబిలిటీ, సుస్థిరతలను ప్రధానంగా రాజధానిని డిజైన్‌ చేస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేసి, ప్రపంచానికి గమ్య స్థానం చేశారో, ఇప్పుడు కూడా అమరావతిని అలా చేస్తారు అని రాసింది. 
        విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు అమెరికాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడమే కాదు..వారిని ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*