విడుదలకు సిద్దమవుతున్న మళ్లీ మళ్లీ ఇది రాని రోజు



Want create site? Find Free WordPress Themes and plugins.
      శర్వానంద్‌, నిత్యామీనన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్‌ ఎంటర్‌టైయిన్‌మెంట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై వస్తోందీ మూవీ. క్రాంతి మాధవ్‌ దర్శకుడు. కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమా మంచి ప్రేమ కథా చిత్రం. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్రవరి 6న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు అనే పాటలో తొలి శరణాన్ని తీసుకుని సినిమా పేరుగా పెట్టారు. చాలా చక్కని పవిత్రతతో  కూడిన ప్రేమకథ ఇదని నిర్మాత కే.ఎస్ రామారావు చెప్పారు. ఎమోషనల్‌, అందంగానూ వుండే ప్రేమకథ ఇదని… ఒక పుష్పగుచ్చాన్ని చూస్తే కలిగే ఫీలింగ్‌ ఈ సినిమా చూస్తే కలుగుతుంది. ఈ ప్రేమకథకు నటులంతా బాగా కుదిరారని ఆయన చెప్పారు. ఈ సినిమాలో శర్వానంద్‌, నిత్యమీనన్‌ పోటీపడి మరీ నటించారని నిర్మాత ప్రస్తావించారు. 
         గోపిసుందర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా…ఆడియో బాగానే ఉంది. సాహితి, రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు, సాయిమాధవ్‌ రాసిన డైలాగ్స్‌ బాగున్నాయి. పెద్ద హీరోల సినిమాల కంటే శర్వానంద్ నటించిన సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి. అందుకే మరోసారి ఈ చిత్రం విజయం సాధించడం ఖాయమంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*