ప్లీనరీలను పెట్టనున్న జనసేన



Want create site? Find Free WordPress Themes and plugins.
జనసేన ఇక రంగంలోకి దిగుతోంది. జనంలోకి వెళుతోంది. ఇందుకు దగ్గర మార్గం వారితో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించనుంది. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్లీనరీ సమావేశాలకు జనసేన సన్నాహాలు చేస్తోంది. జనసేన ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్లీనరీ సమావేశాలపై విస్త్రుతంగా చర్చించారు. వచ్చే ఆరు నెలల్లో పార్టీ కార్యాకలాపాలపై కీలక నిర్ణయాలు ఉంటాయని పవన్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లీనరీపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎక్కడెక్కడ ప్లీనరీలు ఏర్పాటు చేయాలి. ఏంటనేది మరోసారి జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 
       నవంబర్ నుంచి పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయిస్తానని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే ఇక మీదట జనాల్లోకి వెళ్లేందుకు సిద్దమవడం హాట్ టాపికైంది. గతంతో పోల్చుకుంటే జనసేనకు ప్రజల్లో కాస్తంత క్రేజ్ వచ్చిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*