జగ్గారెడ్డి కొత్త పిలుపుతో బిత్తరపోతున్న నేతలు 



Want create site? Find Free WordPress Themes and plugins.
       రెడ్డి సోద‌రులారా అన్ని రాజ‌కీయ పార్టీల్లో ఉన్న రెడ్డి నాయ‌కులారా. జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. రండి. ఏకం కండి. ఈ మాటలన్నది కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. బీజేపీ నుంచి టీఆర్ఎస్ కు ఆ తర్వాత కాంగ్రెస్ కు..కాంగ్రెస్ నుంచి తిరిగి బీజేపీకి…మరోసారి కాంగ్రెస్ కు వచ్చిన నేత జగ్గారెడ్డి. పార్టీలు మారినా..ఆయనకు కలసి రావడం లేదు. అందుకే ఇక కాంగ్రెస్ నుంచి ఎక్కడకు వెళ్లే ఆలోచన చేయడం లేదట. పిల్లి పిల్లలను మార్చినంత తేలికగా పార్టీలు మారుస్తున్న జగ్గారెడ్డి ఇప్పుడు కొత్త నినాదం తీసుకు వచ్చారు. అదే రెడ్డి నినాదం. రాజకీయ పార్టీలు ఎవైనా కులాల పరంగా వెళ్లి సక్సెస్ కాలేదు. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఏకమైతేనే విజయం సాధిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహాం లేదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఈ సంగతులు తెలియనివి కావు. 
        కానీ జగ్గారెడ్డి ఇప్పుడు రెడ్డి నినాదం ఎత్తుకున్నారు. వివిధ పార్టీలో ఉన్న రెడ్డి నేతలంతా ఏకం కావాలట. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా పావులు కదపాలని బాహాటంగానే నినదిస్తున్నాడాయన. రెడ్డి సామాజిక వర్గంతో ఎస్సీలకు మంచి సంబంధాలు ఉన్నాయట. అంతే కాదు..బీసీలు రెడ్డిసామాజిక వర్గాన్ని బాగానే కలవరిస్తాయట. కానీ వెలమల విషయానికి వచ్చేసరికి వారు దూరంగా ఉంటారనే కొత్త మాట చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ కు లాభం చేకూర్చకపోగా..నష్టం కలిగించే అంశమంటున్నారు. కులాల పరంగా పార్టీని వేరు చేసే ఆలోచన మంచిది కాదంటున్నారు. మరి జగ్గారెడ్డి ఎప్పటికి తెలుసుకుంటాడో.
         రేవంత్ రెడ్డి పార్టీలో చేరుతున్న వేళ జగ్గారెడ్డి చేస్తున్న విచిత్ర వాదన నేతలను విస్మయానికి గురి చేస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*