రేవంత్ రెడ్డితోపాటు.. వెళ్లేది వాళ్లే…



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్న సంగతి తెలిసిందే. తనతో పాటు.. ఎవరెవరు పార్టీ మారతారనే విషయంపై ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఒక జాబితాను ఇచ్చారు. వారిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,  మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్‌ నేతలున్నారు. మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్దన్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రా చంద్రశేఖర్‌, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, సీహెచ్‌ విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలు ఉన్నారని తెలుస్తోంది. వారే కాదు… పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, రావి శ్రీనివాస్‌, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణరావు, మేడిపల్లి సత్యం, గడిల శ్రీకాంత్‌ గౌడ్, పటేల్ రమేశ్‌రెడ్డి, బీల్యా నాయక్, రాజారాం యాదవ్, గండ్ర సత్యనారాయణరావుల పేర్లు ఉన్నాయి. 
                        రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీకి ఇచ్చిన జాబితాలో ఉన్న వారితో మాట్లాడే ఇవి ఇచ్చారా లేదా అనేది హాట్ టాపికైంది. రేవంత్‌రెడ్డి వెంట వారంతా నడుస్తారా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. రేవంత్‌రెడ్డి వెంట నడిచే వారిలో 8 జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు ఉన్నారంటున్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు విజయ రమణారావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రెసిడెంట్ ఎర్ర చంద్రశేఖర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్ పటేల్ రమేశ్‌రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు బీల్యా నాయక్, నిజామాబాద్‌ జిల్లా ప్రెసిడెంట్ అరికెల నర్సారెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావులు ఉన్నారని సమాచారం. ఇందులో ఎంత మంది రేవంత్ రెడ్డి పార్టీ మారేనాటికి ఆయనతో ఉంటారనేది ఆసక్తి కలిగించే అంశమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*