యనమలను తప్పించి, ఆనంకు బాధ్యతలు



Want create site? Find Free WordPress Themes and plugins.
       టీడీపీలో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. లాయర్ గా ఉంటున్న యనమలను పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు అన్న ఎన్టీఆర్. అప్పుడు యువకుడిగా ఉన్న యనమల చాలా చురుగ్గా ఉండేవాడు. టీడీపీ పిలుపుకు స్పందించి గోదావరి జిల్లాల్లో పార్టీ జెండాను రెపరెపలాడించేవారు. బీసీల్లోను మంచి పలుకుబడి సంపాదించుకున్న యనమల తునిలో వరుసగా ఆరు సార్లు గెలిచాడు. కానీ పోయిన సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాడిశెట్టిరాజా ( రామలింగేశ్వరావు) యనమలను ఓడించాడు. అయినా సరే సి.ఎం చంద్రబాబునాయుడు యనమలను పిలిచి మరీ గౌరవించారు. ఎమ్మెల్సీనే కాదు..కీలకమైన ఆర్థిక మంత్రి పదవి ఇచ్చి పగ్గాలు అప్పగించారు. అలాంటి యనమల విషయంలో సి.ఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారంటున్నారు. తునిని వదిలేందుకు యనమల సిద్దమయ్యారంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే సమాచారం వస్తోంది. 
       2019 ఎన్నికల్లో యనమల అక్కడ పోటీ చేయడం లేదట. ఆయన సోదరుడు కృష్ణుడు తునిలో పోటీ చేస్తారట. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన యనమల రాజ్యసభకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సి.ఎం చంద్రబాబునాయుడు ఇందుకు ఒప్పుకున్నారంటున్నారు. బీజీపేతో పొత్తు ఉండి..తిరిగి ఎన్డీఏ కూటమి గెలిస్తే…కేంద్ర మంత్రిగా ఉండాలనేది యనమల చిరకాల కోరికట. అందుకే కేంద్రం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 
లెక్కచేయని యనమల…
       కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో యనమల తీరు ఇబ్బందిని తీసుకువచ్చింది. ప్రెస్ మీట్లకు పరిమితమైన యనమల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయలేదనే వాదనుంది. అంతే కాదు..జిల్లా టీడీపీ నేతలతోను సఖ్యతగా ఉండటం లేదట యనమల. మరోవైపు రేవంత్ రెడ్డి పేల్చిన బాంబు ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ సి.ఎం కేసీఆర్ తో రూ.2000 కోట్ల కాంట్రాక్టును మంత్రి యనమల పొందారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన ఐదారు రోజులవుతున్నా..ఇంత వరకు యనమల స్పందించలేదు. అదే సమయంలో కనీసం టీడీపీ నేతలెవరు కాదు అని చెప్పలేదు. 
ఖజానాకు దెబ్బ…
    ఇదే కాదు..జిఎస్టీ వల్ల ఏపీ ఖజానాకు ఎంత భారం అవుతోంది. వాస్తవ పరిస్థితి ఏంటనే విషయంలో అసలు లెక్కలు చూపడం లేదు యనమల. ఫలితంగా ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత లోటుగా మారుతోంది. ప్రతి చిన్న పనికి సి.ఎం చంద్రబాబునాయుడు వెళ్లడం మినహా ఆర్థిక మంత్రిగా కేంద్రం వద్దకు వెళ్లి యనమల మాట్లాడటం లేదు. అందుకే యనమలను తప్పిస్తారంటున్నారు. యనమల స్థానంలో కాంగ్రెస్ లో ఆర్థిక మంత్రిగా పని చేసి, టీడీపీలో చేరిన ఆనం రాం నారాయణరెడ్డిని కూర్చో పెడతారట. ఇటీవల తనను కలిసిన ఆనం సోదరులకు సి.ఎం చంద్రబాబునాయుడు ఇదే విషయం పై హామీఇచ్చారని తెలుస్తోంది. 
చంద్రబాబు విదేశీ టూర్ ముగించుకు వచ్చాక యనమల సంగతి చూస్తారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*