ప్రభాస్ ను కలవరిస్తున్న అందాల తారలు



Want create site? Find Free WordPress Themes and plugins.
 
             ప్రభాస్ ను కలవరిస్తున్నారు అందాల భామలు. బాహుబలితో రెబల్ స్టార్ అంతర్జాతీయ నటుడు అయిపోయాడు. ఈ హీరో ఇప్పుడు ఏవైనా సినిమాలు చేస్తున్నారంటే అది భారీ చిత్రమే అయి ఉంటుంది. నిర్మాతలు కూడా భారీగా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్ముతున్నారు. అందుకే సాహో చిత్రానికి రూ.150 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ కథానాయకుడి సరసన నటిస్తే చాలు అంటోంది బాలీవుడ్ అందాల తార ఆలియా భట్. నన్ను అడిగితే తడుముకోకుండా నటిస్తానని చెబుతోంది. ప్రభాస్‌తో నటించే ఛాన్స్‌ వస్తే అసలు వదులుకోబోనని చెప్పింది బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌. దక్షిణాది నటుల్లో ప్రభాస్‌ అంటే తనకు చాలా ఇష్టమని మనసులో మాట చెప్పింది.
 
         మరోవైపు స్వీట్ అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, రాయ్ లక్ష్మీ, దీపికా పదుకునేలు ఇదే మాట చెప్పారు. బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో సినీ ప్రముఖుల దృష్టి యంగ్ రెబల్ ‌స్టార్‌పై పడింది. ప్రభాస్‌తో ఒక్క సినిమాలోనైనా నటింప చేయాలనే సినీ నిర్మాతల క్యూ భారీగానే పెరిగింది.  బాలీవుడ్ నుంచి వెల్లువలా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయినా ప్రభాస్ చెక్కుచెదర్లేదు. గతంలో ప్రభాస్‌తో నటించడానికి ముఖం చాటేసినా హీరోయిన్లు ఇప్పుడు ఆయనతో నటించాలని తహతహలాడుతున్నారు. ఆ జాబితాలో చేరింది తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ.
 
         తమిళంలో హీరోయిన్‌గా కొనసాగుతోంది వరలక్ష్మి. ‘శక్తి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది. ‘‘ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. ఆయనతో నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ మాత్రం వదులుకుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదని చెప్పింది. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటన అద్భుతం. నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి టాలెంట్‌ ఉన్న నటులున్నారు. వారితోనూ సినిమాలు చేయాలని ఉందంటూ మనసులో మాట వెల్లడించింది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*