రాజా ది గ్రేట్‌ మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3.0/5
నటీనటులు : రవితేజ, మెహ్రీన్, రాధిక, సంపత్ రాజు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : మోహన్ కృష్ణ
ఎడిటింగ్‌ : త‌మ్మిరాజు
 
పరిచయ వాక్యాలు…
 
మాస్ మహారాజా రవితేజ. చాలా కాలం తర్వాత నటించిన సినిమా రాజా ది గ్రేట్. ఆయనకు హిట్ రాక చాలా కాలమే అయింది. మాస్ పాత్రలను చేయడంలో సిద్దహస్తుడు. కానీ ఏమైందో తెలియదు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. అందుకే ఈ సారి మనసు పెట్టి రెండేళ్ల తర్వాత ర‌వితేజ‌ రాజా సినిమాతో తెరపైకి వచ్చాడు. పటాసుతో ట‌పాసులు పేల్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సుప్రీమ్‌తో పర్వాలేదనిపించాడు. అనిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు పెరిగాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు అగ్ర‌నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. ప్రి రిలీజ్ బిజినెస్ బాగానే జ‌రిగింది. ర‌వితేజ ఈ సినిమాలో అంధుడిగా కనిపించడంతో అంచనాలు బాగానే పెరిగాయి. వాస్తవంగా అంతగా ఆకట్టుకుందో లేదో చూద్దాం…
 
ఇక కథలోకి వెళితే…
 
వివాన్ ప‌టేల్ ( విల‌న్‌)కు త‌మ్ముడంటే ప్రాణం. త‌న సోదరుడిని ఓ పోలీస్ ఆఫీస‌ర్ (ప్ర‌కాష్‌రాజ్‌) కాల్చి చంప‌డంతో ప‌గ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే అతని కూతురు (మెహ్రీన్‌)ను చంపాల‌ని ప్లాన్ చేస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో పోలీస్ అధికారి చనిపోతాడు. ప్ర‌కాష్‌రాజ్ స్నేహితుడైన మ‌రో పోలీస్ ఆఫీసర్ (సంప‌త్‌రాజ్‌)కు ఈ విషయం తెలుస్తోంది. త‌న స్నేహితుడి కూతురిని కాపాడేందుకు ఓ ఆప‌రేష‌న్ నిర్వహిస్తాడు. మరోవైపు హీరో రాజా (ర‌వితేజ‌) పుట్టుకతోనే అంధుడు. రాజా త‌ల్లి రాధిక సంప‌త్ రాజ్ వ‌ద్ద కానిస్టేబుల్‌ గా పని చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మెహ్రీన్‌ను కాపాడేందుకు సంప‌త్ చేపట్టిన ఆప‌రేష‌న్‌లో రాధిక భాగమవుతోంది. తన త‌ల్లి కోసం రాజా కూడా ఇందులో చేరతాడు. మెహ్రీన్ ను కాపాడే క్రమంలో  జరిగిన వారిద్దరి పరిచయం ప్రేమగా మారుతోంది. వారు ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు… చివ‌ర‌కు ఈ సీక్రెట్ ఆప‌రేష‌న్ ఏమైంది… ఆ విల‌న్లు ఎలా అంతమయ్యారు…ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగింది… ఏంటనేది కథ…
 
నటనా తీరు…
 
అంధుడి పాత్ర‌లో ర‌వితేజ బాగా నటించాడు. తనకు కనపడక పోయినా రాజా హీరోయిన్‌ను కాపాడే తీరు ఆసక్తికరమే. అనిల్ రావిపూడి ఈ క‌థను చాలా చక్కగా తీశారు. మాస్ మహారాజా బాడీ లాంగ్వేజ్ సినిమాకు బాగా సూటవుతోంది. ఈ కథలో మెహ్రీన్ పాత్ర కీలకమే. తన చుట్టూనే తిరిగే అమ్మాయి పాత్రలో మెహ్రీన్ బాగా చేసింది. విలన్ కు చెప్పిన డబ్బింగ్ సరిగా లేదు. ఇక అన్నపూర్ణ, పృథ్వీ పాత్రలు బాగా నవ్విస్తాయి. రాధిక మాత్రం డ్యాన్సులతో పాటు విలన్ కు డైలాగుల ఛాలెంజ్ చేసింది. మరోవైపు అందాల తార రాశీఖన్నా, సప్తగిరి, తాగుబోతు రమేష్, సంపూర్ణేష్ బాబులు ఏదో ఇలా వచ్చి అలా మెరిసి వెళ్లడానికే సరిపోయింది.
                   శారీరక వైకల్యం ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువే ఉంటాయి. అంధులు చేతి స్ప‌ర్శ‌తో ఏ వ‌స్తువు ఏంటో అంచనా వేస్తారు. ఎక్క‌డ నుంచి ఎన్ని అడుగులు వేస్తే ముందుకు వెళతామో అర్థమవుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాలోని పాత్రలను పాత పద్దతిలో తీసుకుపోయాడు. మ‌ళ‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా వ‌చ్చిన యోధ‌, తెలుగులో వ‌చ్చిన అన‌గ‌న‌గా ఓ ధీరుడు లాంటి సినిమాల ప్ర‌భావం ఇందులో కొంత ఉంటోంది. కామెడీ డోస్ బాగానే ఉంది. హీరో తెలివితేట‌ల‌కు సంబంధించి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక ఫైట్స్‌, యాక్ష‌న్ సినిమాకు ప్రధాన వనరులనే చెప్పాలి. కానీ ఎందుకో ఫ‌స్టాఫ్‌లో ఉన్న ఆసక్తి..సెకండాఫ్ లో తగ్గుతోంది. కాస్త సాగ‌దీత ఉంటోంది. ఫలితంగా సీరియన్ నెస్ తగ్గిందనిపిస్తోంది. అయినా సినిమా బాగానే ఉంది.
 
సాంకేతికంగా….
 
సాంకేతికాంశాలను చూస్తే సాయి కార్తీక్ మ్యూజిక్ అదుర్స్. తొలిసారి ఓ పెద్ద హీరో సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడం మాములు విషయం కాదు. తనకు ఇచ్చిన అవకాశాన్ని చాలా బాగా వాడుకున్నాడు. పాట‌ల‌ే కాదు… బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మోహ‌న్‌కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ ఆకట్టుకుంది. ఫ‌స్టాఫ్‌లో డార్జిలింగ్‌లో అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించిన సీన్లు బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్‌ లో మరింతగా చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో సాగ‌తీత లేకుండా ఉంటే బావుండేది. మొత్తం 149 నిమిషాల ర‌న్ టైంలో క‌నీసం 10 నిమిషాల సీన్లు కట్ చేసిన పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ల అన్న కుమారుడు కంపోజ్ చేసిన యాక్ష‌న్ సీక్వెల్స్, క్లైమాక్స్ యాక్ష‌న్స్ అద్భుతం. ఇక దిల్ రాజు నిర్మాణ విలువ‌లు చెప్పాల్సిన పనిలేదు. ఖర్చుకు ఎక్కడా వెరవలేదని అర్థమవుతోంది.
 
దర్శకత్వ ప్రతిభ….
 
అనిల్ రావిపూడి పటాస్ ను చాలా బాగా తీశాడు. సుప్రీం విషయంలో అనుకున్నంత మేర సక్సెస్ కాలేదనే చెప్పాలి.  ఈ సినిమాకు అదే పంథాను ఎన్నుకున్నాడు. సుప్రీమ్ సినిమాలో దివ్యాంగుల ఫైట్ సీన్‌ ఆకట్టుకుంటోంది. అందుకే అంధుడి పాత్రతో కథను రాసుకున్నాడు.  క‌మ‌ర్షియ‌ల్ గాను సక్సెస్ ను అందుకుంటోంది. అంధుడి క్యారెక్ట‌ర్ చేయడం ధైర్యమే అని చెప్పాలి. కొన్ని డైలాగులు దీపావళి టపాసుల్లా పేలాయి. సినిమా క‌థ ముందే తెలిసిపోతోంది. అయినా హీరో ఎలా నటిస్తాడనే ఆసక్తి ఉంటోంది. కామెడీ సీన్లు అవసరానికంటే ఎక్కువ ఉన్నాయి. ఈ దెబ్బతో అనిల్ రావిపూడికి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.
 
ప్ల‌స్ పాయింట్స్
+ రవితేజ నటన
+ మెహ్రిన్ అందాలు
+ దర్శకత్వ ప్రతిభ
+ నిర్మాణ విలువ‌లు
+ సినిమాటోగ్ర‌ఫీ
 
మైన‌స్ పాయింట్స్
 
– సెకండాఫ్‌ సాగతీత
– ఎక్కువగా కామెడీ
– విలన్ డబ్బింగ్
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*