ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలవకుండా సినిమానా…



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలవకుండానే సినిమా తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ. వాస్తవాలు ఏంటి. ఏం జరిగిందనేది కుటుంబ సభ్యులకు బాగా తెలిసే అవకాశముంది. కానీ వారితో మాట్లాడకుండా అన్నీ నిజాలు చెెప్పే అవకాశం ఉండదు. బయటకు రాని చాలా అంశాలు కుటుంబ సభ్యులకు తెలిసే వీలుంది. అందుకే వారిని కచ్చితంగా కలవాలి. కానీ ఆపని చేసేది లేదంటున్నారు వర్మ. అంటే తనకు తెలిసిన, విన్న అంశాలనే సినిమాలో చూపించేందుకు ఆయన సిద్దమయ్యారంటున్నారు. 
                       లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇంట్లో పని చేసిన వాళ్లు, డ్రైవర్లు, వంట వాళ్లను కలిశాడు వర్మ. వారితో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వచ్చాయట. అందుకే పూర్తి సమాచారాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు వర్మ. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిస్తే వారికి రాజకీయంగాను, వ్యక్తిగతంగాను, మరో రకమైన ప్రయోజనాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాస్తవాలు తీయలేను. అందుకే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిసే ఆలోచన లేదని చెప్పారాయన. 
                      పరిటాల రవి మీద సినిమా తీసినప్పుడు రెండు వర్గాలను కలిశాడు వర్మ. వంగవీటి సినిమా నిర్మించినప్పుడు అదే పని చేశాడు. కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. చూడు. ఒకవైపే చూడు. రెండో వైపు చూడమాకు. మాడి పోతావని బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తోంది. అంటే రెండో వైపు చూస్తే వాస్తవాలు తెలిసి.. తీయాల్సి వస్తుందని.. అలా చేయడం ఇష్టం లేదంటున్నాడాయన. 
                     బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు.. వైకాపా అధినేత జగన్ తోను వర్మ రహస్యంగా భేటీ కావడంతో సినిమాలో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబుకు వ్యతిరేకమైన అంశాలు ఉంటాయనే వాదన సాగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*