కాంగ్రెస్ గూటికి రేవంత్ రెడ్డి 



Want create site? Find Free WordPress Themes and plugins.
      తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడు. హస్తినలో మకాం వేసిన ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు…పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత జానారెడ్డి కుమారుడు, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో టీ.టీడీపీ పొత్తు నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు. తాను కాంగ్రెస్ తో వెళదామంటే…మోత్కుపల్లి వంటి వారు టీఆర్ఎస్ తో వెళితే మంచిదని చెబుతున్నారట. పొత్తుల పై ఎవరూ తొందరపడవద్దని సి.ఎం చంద్రబాబు చెబుతుంటే ప్రస్తుతానికి నేతలంతా ప్రశాంతంగా ఉన్నారు. కానీ రేవంత్‌ హస్తినలో హస్తం పార్టీ నేతలతో మంతనాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే కాదు…అధిష్టానం పెద్దలతోను ఆయన చర్చలు జరిపారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆయనకు అండగా ఉన్నారని..రాహుల్ గాంధీని రహస్యంగా కలిశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
        ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసిన సందర్భంలో తెలంగాణ ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఆయన పేరును పరిశీలిస్తామని హామీనిచ్చారంటున్నారు. నవంబర్‌ 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్‌ సమక్షంలోనే రేవంత్‌ అధికారికంగా కాంగ్రెస్‌లోకి చేరతారని అనుచరులు చెప్పారు.  
        ఆది నుంచీ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు రేవంత్‌రెడ్డి. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే తన పరిస్థితి ఏం కావాలనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*