పవన్ దేవుడు అంటున్న రేణు దేశాయ్



Want create site? Find Free WordPress Themes and plugins.
వారిద్దరు సినిమాలో హీరో, హీరోయిన్. నిజ జీవితంలోను అలానే ఉన్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. కారణం ఏమైనా విడిపోయారు. మరో పెళ్లి చేసుకున్నాడు పవన్ కల్యాణ్. కానీ రేణు దేశాయ్ ఇప్పటికీ పవన్ నా దేవుడు అంటోంది. ఆయన నుంచి కష్టపడే తత్వం, క్రమశిక్షణ, మంచి తనం నేర్చుకున్నానని చెబుతోంది రేణుదేశాయ్. బుల్లితెర హోస్ట్ గా ఇప్పుడు రేణు తెలుగు వారికి మరింత దగ్గరవుతోంది. ఇదే సమయంలో ఆమె ఇంటర్వూలను తీసుకునేందుకు మీడియా క్యూ కడుతోంది. తాజాగా ఆమె చాలా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 
                      పవన్ కల్యాణ్ కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. వారికి సమయం కేటాయిస్తాడు. ఏదైనా పని అనుకున్నాడంటే వదిలే రకం కాదు.. చివరి అంచుల వరకు వెళతారు. బాగా శ్రమిస్తాడు. పట్టుదల ఎక్కువ. అందుకే ఆయనకు ప్రత్యేక గౌరవ, మర్యాదలు అందుతాయని చెప్పారు రేణుదేశాయ్. ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించిన సంగతులను చెప్పారు. చేయిని మెడ మీద పెట్టుకుని మేనరిజమ్ చూపించే సీన్ ను బద్రి సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు చేశాడు. ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ చేయిని మెడ పై పెట్టుకున్నాడు. అదే బాగుంటుందని అంతా అనుకున్నాం. చివరకు పవన్ కల్యాణ్ అంటే మెడ మీద చేయి పెట్టుకోవడం అలవాటు అయిందని గతాన్ని గుర్తు చేసుకుంది రేణు
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*