వర్మ సైకో అంటున్న ప్రభాకర్ చౌదరి



Want create site? Find Free WordPress Themes and plugins.
        తొలిగా ఎమ్మెల్సీ బాబు రాజేంధ్రప్రసాద్, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మొన్న పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత, నిన్న వాణి విశ్వనాధ్ వర్మ పై సెటైర్ వేశారు. నేడు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అదే బాట పట్టారు. ఏకంగా వర్మను సైకోతో పోల్చాడు. సైకో ఏం చేస్తాడో అందరికీ తెలుసు. ఇప్పుడు వర్మ అంతేనన్నాడు. మాములుగానే వర్మ ఎవరికీ అంత తేలికగా లొంగే రకం కాదు. ఒత్తిడి తీసుకువచ్చి వంచాలని ప్రయత్నిస్తే మరింత వ్యతిరేకంగా మారతాడు. వివాదాలు ఆయనకు కొత్తేం కాదు. ఇప్పుడు అదే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీస్తు వివాదాల అగ్గిని రాజేశాడు. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రను ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే వాడిలా..దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపికైంది. 
        బ్రదర్ అనిల్ కుమార్ తో వర్మ రహస్య భేటీ తర్వాత అది మరింతగా చర్చకు దారితీసింది. ఫలితంగా టీడీపీ నేతలు వర్మను టార్గెట్ చేస్తున్నారు. వర్మ తీసే సినిమా సారాంశం ఏంటో ముందే అర్థం కావడమే ఇందుకు కారణం. అయినా వెనక్కు తగ్గనంటున్నాడు వర్మ.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*