రాకేష్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారట



Want create site? Find Free WordPress Themes and plugins.
        లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి. నిన్నటి వరకు ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి. నేడు అందరికీ తెలిసిన వైకాపా నేత అయ్యారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఖర్చుకు వెరవకుండా నిర్మిస్తున్నారు. తెరవెనుక ఎవరున్నారనేది పెద్దగా గెస్ చేయాల్సిన  పనిలేదు. బ్రదర్ అనిల్ కుమార్ తో వర్మ రహస్య భేటీ కావడంతోనే ఈ సినిమాలో అంశం ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. 
        ఆ అంశం పక్కనపెడితే ఇప్పుడు రాకేష్ రెడ్డికి పలమనేరు వైకాపా టిక్కెట్ ఇస్తారట. అమర్ నాధ్ రెడ్డి వైకాపా నుంచి టీడీపీకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా నియోజకవర్గంలో వైకాపాకు గట్టి నేత లేరు. అందుకే రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ సినిమా నిర్మాణం అయ్యే లోపు రాకేష్ పలమనేరు నియోజవర్గంలో తనకున్న పరిచయాలను విస్తరించనున్నాడు. ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అసలు ఎన్నికల్లోపోటీ చేసేందుకే ఈ సినిమాను పెట్టుకున్నారంటున్నారు. 
       తొలిగా రాం గోపాల్ వర్మ ఎన్టీఆర్ సినిమా తీసేందుకు సిద్దమయ్యారు. బాలయ్య అతని విషయం పై సానుకూలంగానే ఉన్నారట. కానీ తనకు చెప్పకుండానే వర్మ సినిమాను ప్రకటించడం ఆశ్చర్యమేసింది. ఈలోపే వర్మ ఎన్టీఆర్ కుటుంబానికి దూరంగా వెళ్లాడు. మరోవైపు వైకాపా నేతలు ఆయనతో సంప్రదింపులు జరపడం ఇందుకు ఆయన సిద్దమవడం చక చకా జరిగిపోయాయి.  అమర్ నాధ్ రెడ్డిని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. కానీ తన ప్రయత్నం గట్టిగానే చేస్తానని చెబుతున్నాడట రాకేష్ రెడ్డి. రాజకీయాలే కాదు..సినిమాలకూ రాకేష్ కొత్తనే. అందుకే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నాడట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*