కోట్లకు జగన్ పిలుపు



Want create site? Find Free WordPress Themes and plugins.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. సి.ఎం. చంద్రబాబును కలవడంతో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు వైకాపా అధినేత జగన్. కోట్లకు కర్నూలు ఎంపీతో పాటు.. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతకు ఆలూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు జగన్ సిద్దమయ్యారంటున్నారు. అంతే కాదు.. మరో ఎమ్మెల్యే సీటును ఆయన చెప్పిన వారికి ఇచ్చేందుకు జగన్ ఒప్పుకున్నారంటున్నారు. అందుకే కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి రావాలని కోరారట. త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే వీలుంది.
                     తన రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం, ప్ర‌జ‌ల కోసం పార్టీ మార‌డంలో త‌ప్పు లేద‌ని కోట్ల అనుచరులు ఆయనకు చెబుతున్నారు. కొద్ది రోజుల కింద‌ట ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని కోట్ల కలిసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టీడీపీలోకి ఆయ‌న్ని ఆహ్వానించార‌నే ప్ర‌చార‌ం ఉంది. కోట్ల కుటుంబానికి చెందిన పిల్లలకు చంద్రబాబునాయుడు మెడికల్ సీట్లు ఇప్పించారంటున్నారు.  ఇలాంటి సమయంలో కోట్ల టీడీపీవైపుగా.. వైకాపా వైపు అడుగు వేస్తారా అనేది ఉత్కంఠను పెంచుతోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*