నారాయణ కాలేజి పై చర్య తీసుకునే దమ్ము ఉందా Want create site? Find Free WordPress Themes and plugins.
      నారాయణ కాలేజి మంత్రి నారాయణకు చెందింది. ఆ కాలేజిలో చదివే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నారాయణ వియ్యంకుడే ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఫలితంగా ఆ కాలేజి మీద చర్యలు ఉండవు కాక ఉండవు. చర్యలు తీసుకునే దమ్ము గంటా శ్రీనివాసరావుకు లేదంటారు బాధితుల తల్లిదండ్రులు. వారు చేసే పనుల వల్ల సి.ఎం చంద్రబాబునాయుడు ఇరుకున పడాల్సి వస్తోంది. ఒకరు చనిపోయారంటే ఏదోలే అనుకుంటారు. వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నా దున్మపోతు మీద వాన పడ్డట్లుగా ఉంది మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుల వ్యవహారశైలి. చనిపోయింది తమ పిల్లలు కాదు అనుకుంటున్నారో మరోకటో తెలియదు. మొత్తం పిట్టల్లా రాలిపోతున్నారు ఆ కాలేజి విద్యార్థులు. 
  
       ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లు భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువు పేరుతో పెట్టే టార్చర్ మాములుగా ఉండటం లేదు. తినేందుకు, పడుకునేందుకు సమయం ఇవ్వడం లేదు. టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టి వారిని ఏడిపిస్తున్నారు. ఇక ఈ చదువు మాకు వద్దని బలవన్మరణానికి పాల్పడుతున్నారు పిల్లలు. ఇంత జరగుతున్నా…కాలేజీ యజమాన్యం పై చర్య తీసుకునే సాహసం చేయడం లేదు ప్రభుత్వం. ఇది మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. 
కిల్లింగ్ నారాయణ అంటూ లేఖలు
        మూడు రోజుల వ్యవధిలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు. ‘వేస్ట్ నారాయణ.. కిల్లింగ్ స్టూడెంట్స్. నారాయణ కాలేజీలను మూసేయాలనే నినాదం ఊపందుకుంటోంది. అవే విషయాలను లేఖ రూపంలో  రాసి సాయి ప్రజ్వల అనే అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ర్యాంకులు రావాలనేది నిజమే. కానీ అవి సాధించేందుకు ఎన్నుకునే పద్దతులు నారాయణ కాలేజిలో సరిగా లేవు. చదువు. చదువు. చదువు. మరో వ్యాపకం లేకుండా చేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఊసే ఉండదు. స్వేచ్ఛ అనేది లేకుండా పోతోంది. 
రంగంలోకి దిగిన చంద్రబాబు
         వరుసగా జరుగుతున్న సంఘటనలకు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణపై దృష్టి పెట్టింది. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నఆయా కళాశాలల యాజమాన్యాలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆత్మహత్యలకు గల కారణాలపై పూర్తిగా చర్చించారు. కాలేజీ యాజమాన్యాలకు పలు సూచనలు, హెచ్చరికలు పంపారు. విద్యార్థులను చదివించండి. కానీ టార్గెట్ ల పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. విద్యార్థులను రోబోలుగా మార్చే విద్యావిధానాన్ని ఆపాలన్నారు. కార్పొరేట్ కళాశాలలు స్వీయనియంత్రణ పాటించాలని, నాలుగైదు రోజుల్లో మార్పు రావాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థులను చదువుకే పరిమితం చేయవద్దన్న సీఎం.. విద్యార్థుల సోషల్‌ వర్క్ కు 5 శాతం మార్కులు తప్పనిసరని చెప్పారు. 
అధికారులకు హెచ్చరికలు
          మంత్రి గంటా చేతగాని తనం విద్యార్థులకు శాపంగా మారింది. అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకునే వరకు మంత్రి ఏం చేయలేకపోయారు. చేష్టలుడిగినట్లు చూస్తుండి పోయారు తప్ప ఎలాంటి చర్యలు లేవు. నెలకోసారి కమిటీతో, 3 నెలలకోసారి కళాశాలల ప్రతినిధులతో ఇప్పుడు సి.ఎం సమీక్ష జరుపుతామన్నారు. ఇక ఇంటర్ లో ర్యాంకుల పద్ధతిని ఎత్తివేసి గ్రేడింగ్ విధానాన్ని తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించడం విశేషం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*