కేబినెట్ విస్తరణలో చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
      ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ను మరోసారి విస్తరించనున్నారు. ఇటీవలనే వైకాపా నుంచి వచ్చిన 21 మందిలో నలుగురిని మంత్రులుగా తీసుకున్నారు సి.ఎం చంద్రబాబునాయుడు. ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, సుజయ రంగారావులకు పదవులు దక్కాయి. వారితో పాటు మరికొందరు పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. అందుకే వచ్చేవారిలో కొందరికి సీట్లు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. కడప, కర్నూలు,అనంతపురం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు నేతలు వైకాపాను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. వారే కాదు..ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు జగన్  జెండాను పక్కన పెట్టి సైకిల్ ఎక్కనున్నారట. అందుకే వారిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
     మరోవైపు ఇప్పుడున్న వారిలో ముగ్గురిని తప్పించి మరికొందరికి చోటు కల్పించే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబునాయుడు. అదే సమయంలో  రాబోయే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు నేతలను వ్యూహాత్మకంగా వివిధ పనులకు వినియోగించనున్నారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే ఎంతటి పెద్ద వారినైనా వదిలేది లేదని గతంలోనే చెప్పారు ఆ పార్టీ అధినేత. అన్నట్లుగానే తోక జాడించిన సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు పార్టీ పదవుల్లో చోటు కల్పించారు. ఫలితంగా ఎవరూ కిక్కురుమనడం లేదు. 
        ఇప్పుడు కేబినెట్ లో ఎవరికి చోటు ఉంటోంది. మరెవరిని పక్కన పెడతారనే విషయం హాట్ టాపికైంది. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే వీలుంది. వచ్చే డిసెంబర్ నాటికి కొత్త కేబినెట్ ఏర్పాడటం ఖాయమంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*