చంద్రబాబును కలిసిన బుట్టా రేణుక



Want create site? Find Free WordPress Themes and plugins.
అనుకుందే అయింది. ముందుగా మీడియాలో వచ్చిన ప్రచారం నిజం చేసింది కర్నూలు వైకాపా ఎంపీ బుట్టా రేణుక. సి.ఎం చంద్రబాబునాయుడును కలిసి తెదేపా పార్టీలో చేరేందుకు సిద్ధమని చెప్పారు. ఉండవల్లిలోని సి.ఎం. నివాసానికి వచ్చిన బుట్టా రేణుక చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. కర్నూలులో పెద్ద బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారామె. బుట్టా రేణుకతో పాటు… మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌ రెడ్డిలు టీడీపీలో చేరనున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కితాబునిచ్చారు బుట్టా రేణుక. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనను స్వర్ణయుగంగా చెప్పారామె. ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తున్నారని పార్లమెంటులో తనతో చెప్పిన సంగతులను గుర్తు చేశారామె. రాజకీయాలకు కొత్త అయినా రాష్ట్ర అభివృద్ధికి తోడుగా నిలుస్తానని రేణుక చెప్పారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*