వైకాపాలో జగన్ వ్యతిరేక నినాదాల హోరు



Want create site? Find Free WordPress Themes and plugins.
అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ సమావేశంలో జగన్ వ్యతిరేక నినాదాలతో మారు మోగింది. ఎంపీ మిధున్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమన్వయ భేటీకి మాజీ ఎమ్మెల్యే గురున్నాధరెడ్డిని ఆహ్వానించలేదు. అంతే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అక్కడకు చేరారు. ఇప్పటి వరకు పార్టీని కాపాడుతూ వచ్చిన అతన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఇందుకు మిధున్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతే గురున్నాధరెడ్డి అనచరులు సమావేశంలోనే కుర్చీలు విరగ్గొట్టి పడేశారు. విసిరేశారు. అంతా రచ్చ రచ్చ చేశారు. ఇంత చేసినా మిగతా నేతలు ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన్ను పిలవలేదు కాబట్టి ఇలా చేస్తున్నారంటూ మౌనం దాల్చారు. ఇక లాభం లేదనుకున్న మిధున్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయారు. 
                         అయినా సరే వెనుక్కు తగ్గలేదు వాళ్లు. తమ నేతను ఎందుకు పిలవలేదని మరోసారి ప్రశ్నించారు. నా చేతిలో ఏమి లేదని చెప్పేసరికి వారు ఆగ్రహంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. చేనేత కార్మికుల సమస్యలపై రేపు ధర్మవరంలో వైసీపీ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ ఆధినేత జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం వైసీసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. గుర్నాధరెడ్డి టీడీపీలోకి జంప్ చేస్తున్నాడనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. అందుకే అతన్ని పిలవలేదనేది వాస్తవం. కానీ అధికారికంగా తాను పార్టీ మారుతున్నట్లు గుర్నాధరెడ్డి ఎక్కడాప్రకటించలేదు. కానీ ఆయన్ను పిలవకుండా అవమానించిందనే వాదన వచ్చింది. 
                        కావాలనే గుర్నాధరెడ్డి వర్గీయులు వచ్చి రచ్చ చేశారని తెలుస్తోంది. ఆయన సూచన మేరకే ఇలా కుర్చీలు విరగ్గొట్టారని.. వైకాపాను బదనాం చేయడమే వారి లక్ష్యమని చెబుతున్నారు మరోవైపు ఆ పార్టీ నేతలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*