బెజవాడ బరిలో బ్రదర్ అనిల్



Want create site? Find Free WordPress Themes and plugins.
        బ్రదర్ అనిల్ కుమార్ వైకాపా అధినేత జగన్ కు బావ. షర్మిల భర్త. 2014 ఎన్నికల సమయంలో వైకాపాకు బాగానే అండగా ఉన్నాడు బ్రదర్ అనిల్. క్రిస్టియన్ కమ్యూనిటీని కాపాడటంలో, వారి ఓట్లు వైకాపాకు పడటంతో తన వంతు సాయం చేశాడు. చర్చిలలో మీటింగ్ లు పెట్టి మరీ ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత ఆయన ఊసే లేదు. కానీ ఇప్పుడు జగన్ తో పాటు..పలుకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. లూటస్ పాండ్ లోనే కాదు..బెజవాడలో జరిగిన పార్టీ సమావేశాలకు అనిల్ హాజరవుతున్నాడు. మరోవైపు రానున్న ఎన్నికల్లో విజయవాడ సీటు నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నాడట అనిల్. ఇందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. అదే నిజమైతే పోటీ రసవత్తరంగా సాగనుంది.
        కడప ఎంపీ నుంచి షర్మిల పోటీ చేస్తారనే మరో ప్రచారం సాగుతోంది. ఇంట్లో ఒకరికే చాన్స్ అని జగన్ చెప్పగా..అయితే మాలో ఎవరైనా ఒకరికి చాన్స్ ఇవ్వాలని షర్మిల షరతు పెట్టారట. అందుకు ఒప్పుకున్న బ్రదర్ అనిల్ పార్టీ కార్యక్రమాల్లో పాల్లొంటున్నారనే చర్చ సాగుతోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*