భీమిలి సీటు పై ప్రధాన పార్టీల కసరత్తు



Want create site? Find Free WordPress Themes and plugins.
         మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం భీమిలి. విశాఖ జిల్లాలో ఉందా సీటు. మరోసారి అక్కడ నుంచి పోటీ చేసేందుకు గంటా సిద్దపడటం లేదనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్ ఈ సారి బరిలోకి దిగుతారంటున్నారు. అదే జరిగితే…వైకాపా నుంచి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపే పని చేస్తున్నారు జగన్. గంటా పోటీ చేస్తే బొత్సాను, అదే అనకాపల్లి ఎంపీ పోటీ చేస్తే తన బంధువు చిన శ్రీనును బొత్స బరిలోకి దింపుతారంటున్నారు. చిన శీనును గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు సత్తిబాబు. 
       స్థానికంగా గంటాకు వ్యతిరేకత బాగా ఉంది. నియోజకవర్గ ప్రజలకు ఆయన పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. అభివృద్ధి పనుల విషయంలో గంటాను కలుద్దామనుకున్న ప్రజలకు నిరాశ మిగులుతోంది. ఆయన వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ కొత్త నియోజకవర్గంలో పోటీ చేసే ఆలోచన చేస్తున్నారట. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు గంటా. ఆ తర్వాత 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా రేసులో నిలిచి విజయం సాధించారు. టీడీపీలో కలిసి రాలేదని ఆయన పార్టీ మారారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పక్షాన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2014లో గంటా పార్టీనే కాదు..నియోజకవర్గాన్ని మార్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. ఆ తరువాత బీమిలి నుంచి పోటీ చేసి గెలిచాడు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం..ఆ తర్వాత కాంగ్రెస్, తిరిగి టీడీపీకి మారినా ఓటమి ఎదురుకాలేదు. ఈ సారి టీడీపీలోనే ఉంటారా..లేదా అనే చర్చ సాగుతోంది. అంతే కాదు..బీమిలి నుంచి ఇంకోసారి పోటీ చేస్తే గెలుస్తానా లేదా అనే అనుమానం వచ్చిందట. అందుకే ఈ సారి గంటా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. 
      భూ కుంభకోణంలో గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందనే ఆరోపణలు లేకపోలేదు. అందుకే బీమిలి నుంచి మరో నియోజకవర్గానికి మారేందుకు సిద్దమయ్యారంటున్నారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన గంటా విశాఖలో బాగానే చక్రం తిప్పుతున్నారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడుతో వివాదాలు ఉన్నా. చాకచక్యంగానే వ్యవహరిస్తున్నారు. తాను పోటీ చేసిన ప్రతిసారి గంటా గెలవడం విశేషం. గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోను విజ‌యాలు సాధిస్తూనే వ‌స్తున్నారు.  ఈసారి యలమంచిలి లేకపోతే విజయనగరం జిల్లా నెల్లిమర్లను ఎంచుకుంటారని పార్టీ వర్గాలంటున్నాయి. 
గంటా వారసుడు పోటీకి ఆసక్తి…
       మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు రవి తేజ. జయదేవ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది నిరాశ పరిచింది. అందుకే ఇప్పుడు ఆయన  సినిమాలను పక్కనపెట్టి రాజకీయల వైపు ఆలోచిస్తున్నారట. చోడవరం నియోజవర్గం నుంచి పోటీచేసే ఆలోచన చేస్తున్నారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే రాజు తప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ టీడీపీ నుంచి టిక్కెట్ రాకపోతే జనసేనలో చేరి చోడవరంలో పోటీ చేసేందుకు రవి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*