జగన్ కు షాక్ ఇచ్చిన కామ్రేడ్లు



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నాడు విపక్ష అధినేత జగన్. నవంబర్ 2నుంచి ఇడుపుల పాయలో యాత్ర మొదలుకానుంది.  అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ యాత్ర పై ఉత్కంఠ నెలకుంది. కోర్టు ఇందుకు అనుమతి ఇస్తుందా లేదా అనే అంశం తేలకపోవడమే ప్రధాన కారణం. ప్రతి శుక్రవారం సి.బి.ఐ కోర్టుకు జగన్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలా రాకుండా జగన్ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోర్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా యాత్రకు రంగం సిద్దం చేసుకున్నాడు వైకాపా అధ్యక్షుడు జగన్. ఇందుకు భారీగా జనసమీకరణ చేయాలని భావించాడు.
                  తమ పార్టీ వారితో పాటు.. మిగతా పక్షాల మద్దతు కోసం చర్చలు జరిపారు వైకాపా నేతలు. తొలిగా సి.పి.ఐ, సి.పి.ఎంలతో ఆ పార్టీ నేతలు మంతనాలు చేశారు. ప్రజల కోసం యాత్ర చేస్తున్నందు వల్ల తమకు మద్దతు నివ్వాలని వారు కోరారు. కానీ కమ్యూనిస్టులు ఇందుకు అభ్యంతరం చెప్పారట. ముందు బీజేపీ పై మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు వాళ్లు. అది ప్రకటించండి. తర్వాత మీకు మద్దతునివ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని రెండు పార్టీల నేతలు తేల్చి చెప్పారు. ఇది జగన్ కు షాక్ గా మారింది.
                  సి.ఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పంథాలో కమ్యూనిస్టులు తనతో కలిసి వస్తారని జగన్ భావించాడు. కానీ వ్యవహారం బెడిసి కొట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మధ్యలో ఎందుకు విరామం ఇచ్చారో జగన్ చెప్పాలని కోరారు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు. అంతే కాదు.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీకి ఎలా మద్దతు ఇచ్చింది వివరించాలని అడిగారు.
                   తన కేసుల నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు హోదాను బయటకు తెస్తున్నారు తప్ప సీరియస్ గా దృష్టి పెట్టలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పై ఒక్క కామెంటు చేయకపోవడం వెనుక అసలు కారణం ఇదేనని వారు చెప్పారట. దీంతో జగన్ పార్టీ నేతలు అక్కడ నుంచి చల్లగా జారుకున్నారనే చర్చ సాగుతోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*