రేటు పెంచిన రకుల్Want create site? Find Free WordPress Themes and plugins.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో వెలుగులోకి వచ్చింది ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు రాష్ట్రాల్లో జిమ్ సెంటర్లు పెడుతోంది. మరికొన్ని చోట్లకు వాటిని విస్తరిస్తోంది. రెండు చేతులా సంపాదిస్తోంది. నా మిగతా జీవితమంతా హైదరాబాద్ లో వెచ్చిస్తానంటోందీ నాజూకు భామ.  తెలుగులో నా మొదటి సినిమా ‘కెరటం’. కానీ అంతా తాను వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మొదటి సినిమా అంటున్నారు. మోడలింగ్‌ మొదలెట్టిన నెల రోజులకే అనుకోకుండా సినిమా ఛాన్స్‌ వచ్చింది. పాకెట్‌ మనీ కన్నా ఎక్కువ డబ్బులొస్తాయని కెరటం ఒప్పుకున్నానని చెప్పింది ముద్దుగుమ్మ. ఒక కారు కొనుక్కుని ఫ్రెండ్స్‌ ముందు బిల్డప్‌ ఇద్దామనుకున్నా. అందుకే ఆ సినిమా ఒప్పుకున్నానని చెప్పింది. ఆ సినిమాలోని ప్రత్యేక పాత్ర కోసం ఐదు రోజులు పనిచేశా. ఆ తర్వాత రెండేళ్లకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో అవకాశం వచ్చిందని గతాన్ని ప్రస్తావించింది రకుల్. 
లవ్ చేయాలనే ప్రపోజల్
మహేష్ తో స్పైడర్, నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది రకుల్. ప్రిన్స్ మహేష్ తో నటించిన స్పైడర్ సినిమాలో రకుల్ పాత్రకు ప్రశంసలు లభించాయి. కష్టపడితేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. తనకు వచ్చిన అవకాశాలు పోయాయని బాధపడితే లాభం లేదంటోందీ అమ్మడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది. మెగా హీరోలతో పాటు.. కుర్ర హీరోలందరితో నటిస్తూ దూసుకెళుతోంది. హార్డ్ వర్క్ తో పాటు.. అదృష్టం కలిసి రావాలని చెబుతున్నారామె. అంతే కాదు… తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు అందాల తార. తనకు ఎక్కువగా ప్రపోజల్స్ రాలేదని చెబుతున్న రకుల్.. అందంగానే ఉంటాను. ఎందుకో ఎవరు ఇష్టపడటం లేదని చెప్పింది. హీరోయిన్లను అందాల కోసమే చూస్తుంటారు అభిమానులు. అలాంటి వారి కోసం అందంగా కనపడితే తప్పు లేదంటున్నారు రకుల్.
                 సినిమా హీరోయిన్లు ఫ‌స్ట్‌లో త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఏ విధంగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆలోచిస్తారు. కొత్తగా వ‌చ్చిన తారలకు ఒక్కసారిగా రెండు వరుస హిట్స్ వస్తే చాలు.. వారి రేంజ్ అమాంతం పెరిగిపోతోంది. గ్లామర్ ని మరింత పెంచి కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. తమ రేంజ్ కి తగ్గట్టే పారితోషికం సైతం అమాంతం పెంచేస్తారు. తమ అందాలనే పెట్టుబడిగా పెట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తారల్లో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉన్నారు..
రేటు విషయంలో తగ్గేదే లేదు…
టాలీవుడ్ లో బిజీ అయిన హీరోయిన్ రకుల్. నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం వంటి పెద్ద చిత్రాలలో నటించిన ఆమె పలు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరైన రకుల్ ప్రీత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తుందట. కోటి 50 లక్షలు అందుకుంటూ యాడ్ రెవెన్యూలోనూ టాప్ ప్లేస్ లోనే ఉందీ ముద్దుగుమ్మ. సినిమా అయినా… యాడ్స్ అయినా పారితోషికం విషయంలో తగ్గేది లేదంటోంది. పరిశ్రమలో నాలుగు కాలాల పాటు ఉండాలంటే అవసరాన్ని బట్టి తగ్గాలంటున్నారు మరోవైపు నిర్మాతలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*