పవన్ ఫోకస్ యూత్ మాత్రమేనా?



Want create site? Find Free WordPress Themes and plugins.

జనసేన పార్టీ వ్యవస్థీకృత నిర్మాణానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. పలుదఫాలుగా ఇప్పటికే అనేక వర్గాలతో సమావేశాలు, భేటీలు నిర్వహించుకుంటూ సన్నద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియకు కూడా శ్రీకారం దిద్దిన సంగతి తెలిసిందే. పవన్ పోకడలను గమనిస్తే ఆయన అచ్ఛంగా యూత్ మీద మాత్రమే ఫోకస్ పెట్టినట్లుగా అర్ధమవుతోంది.

 జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు ఆన్ లైన్ లో మాత్రమే డిజిటల్ పద్దతిలో జరుగుతాయని  పవన్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా సభ్యత్వాల నమోదుకు పార్టీ ఒక ప్రత్యేకమైన యాప్ ను రూపొందించడం గమనిస్తే పవన్ వ్యూహం ఎవరికైనా అర్ధం అవుతుంది. తనకు ప్రధానంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యూత్ కేటగిరీలోనే పార్టీకి కూడా ఆదరణ సృష్టించుకోవాలని జనసేన తలపోస్తున్నట్లుంది. యాప్ ద్వారా అయితే ఆన్ లైన్ కంటే కూడా చాలా ఎక్కువగా సభ్యత్వ నమోదులు వస్తాయని వారు భావిస్తున్నారు.

 సాధారణంగా రసీదు పుస్తకాల ద్వారా సభ్యత్వాల నమోదుకంటే ఆన్ లైన్ లో నమోదులు అధికంగా ఉంటాయి. ఈ పద్దతి కంటే కూడా యాప్ ద్వారా యూత్ సెక్షన్ నుంచి సభ్యత్వాలు పెరుగుతాయి. ఆన్ లైన్ వ్యాపారాలు చేసే అమెజాన్ వంటి సంస్థలు యాప్ ను ఉపయోగించి కొనేవారికి అదనపు సదుపాయాలు, డిస్కౌంట్ లు ఎన్నో ప్రకటిస్తుంటాయి. యాప్ ద్వారా అయితే రీచ్ బాగా ఎక్కువగా ఉంటుందనేది ఒక అధ్యయనం. ఇలాంటి కారణాలు అన్నీ దృష్టిలో ఉంచుకునే జనసేన యాప్ కూడా రూపొందింది. దీనితోపాటు ఆన్ లైన్ నమోదులు కూడా చేయొచ్చు. రసీదు పుస్తకాలు మాత్రం అసలుండవు. ఎలా చూసినా పవన్ యూత్ మీదనే ఫోకస్ పెట్టారని తేలుతోంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*