కర్నాటకలో జూనియర్ ఎన్టీఆర్ కు గుడి



Want create site? Find Free WordPress Themes and plugins.
         యంగ్ టైగర్ ఎన్టీఆర్. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ బుడ్డోడి పై కన్నడిగులు మనసు పారేసుకున్నారు. తమ అభిమాన నటుడిలో వారు దేవుడిని చూస్తున్నారు. అందుకే ఏకంగా గుడి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ కర్నాటకలోని తెలుగు వారు నివాసముండే ప్రాంతాల్లో వసూళ్ల రికార్డులు క్రియేట్ చేస్తోంది. బళ్లారి, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో మాస్ జనం ఎన్టీఆర్ ను బాగా అభిమానిస్తోంది. అందుకే ఆయన కోసం గుడి కట్టే ఆలోచన చేస్తున్నారు.
              తమిళనాడులో అందమైన హీరోయిన్లకు గుళ్లు, గోపురాలు కట్టి అందులో ఆమె విగ్రహాలను పెడుతున్న సంగతి తెలిసిందే. వారిని దేవతల్లా కొలుస్తు పూజలు, పునస్కారాలు చేయిస్తున్న సంగతి కొత్త కాదు. గతంలో ఖుష్బూ, నమిత, హన్సికలకు ఇలానే గుడులు కట్టించారు. తాజాగా కీర్తి సురేష్ కు గుడికట్టి తమ పిచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు అందమైన భామలే కాదు… మంచి హీరోలకు గుడులు కట్టించే సంప్రదాయం తమిళనాడులో ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అక్కడ గుడి కట్టించారు. ఇప్పుడు అది పక్క రాష్ట్రం కర్నాటకకు పాకింది.
          కన్నడదేశంలో అందులోను ఒక తెలుగు హీరోకి గుడి కట్టనుండటం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన “జై లవకుశ” సినిమా బాగా ఆడుతోంది. అందుకే బళ్లారిలో గుడి కట్టనున్నారు ఎన్టీఆర్ అభిమాని. త్వరలోనే  గుడి కట్టేది ఎక్కడ.. ఏంటనే వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*