జగన్ కు కూడా వాస్తు పిచ్చి పట్టుకుందా?



Want create site? Find Free WordPress Themes and plugins.

తెలుగు రాష్ట్రాలకు లముఖ్యమంత్రులు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రులు కావాలని అనుకుంటున్న వాళ్లు కూడా వాస్తు పిచ్చితో, జాతకాల నమ్మకాలతో తమ కెరీర్ మొత్తాన్ని రీ డిజైన్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వారి వారి రాజకీయ వ్యూహాలు.. పార్టీ వార్ రూముల్లో సీనియర్లతో జరిగే సమావేశాలలో కాకుండా, స్వామీజీల అనుగ్రహ సంభాషణల్లో డిసైడ్ అవుతున్నాయి. స్వతహాగా మత విశ్వాసాల పరంగా క్రిస్టియానిటీని అనుసరించే జగన్ కూడా.. ఇలాంటి నమ్మకాలకు తాను అతీతం కాదని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్.. పాదయాత్ర ముహూర్తాన్ని మార్చడం వెనుక కూడా.. ఇలాంటి గ్రహప్రభావాల నమ్మకాలే ఆయనను నడిపిస్తున్నాయని వినిపిస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలుత అక్టోబరు 26 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత.. ఎలాంటి కారణాలను ప్రకటించకుండానే, ఆ తేదీకి ఏం ఇబ్బందులు వచ్చాయో చెప్పకుండానే.. ముహూర్తాన్ని నవంబరు 2వ తేదీకి మార్చారు. ఇదంతా కేవలం స్వామీజీల మాట మేరకే అనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. దాన్ని ప్రారంభించడానికి కూడా జగన్ మీనమేషాలు లెక్కించారు. తొలుత జగన్ జన్మనక్షత్రాన్ని బట్టి గ్రహప్రభావాలకు అనుకూలంగా.. ఆయనకు అనుకూలమైన మంచి ముహూర్తాన్ని నిర్ణయించినట్లు ప్రకటించారు. తర్వాత పనులు కొంత మేర పూర్తి కాలేదంటూ.. ఆ ముహూర్తానికి ప్రారంభం వాయిదా పడింది. కొన్ని వారాల కిందట ఆ కార్యాలయం ప్రారంభించేశారు. జగన్ మాత్రం వెళ్లలేదు. ఇతర నాయకులే పని నడిపించేశారు. ఇవన్నీ కూడా స్వామీజీల మాట ప్రకారమే జగన్ చేస్తున్నట్లుగా పార్టీలో చెప్పుకుంటున్నారు.

అలాగే.. ప్రస్తుతం జగన్ ఉంటున్న నివాసం లోటస్ పాండ్ లోని అత్యద్భుత భవంతి విషయంలోకూడా ఆయనకు అనుమానాలు కమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రారంభించి.. ఆతర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ ఇంటి నిర్మాణాన్ని జగన్ పూర్తి చేశారు. కనులు చెదిరేంత విశాలమైన ఇంద్రసౌధాన్ని ఆయన నివాసంగా నిర్మించుకున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత.. పార్టీ కార్యాలయం కోసం విడిగా తీసుకున్న అద్దె భవనాన్ని ఖాళీచేసి, ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ లోటస్ పాండ్ భవంతికి వాస్తు దోషం ఉన్నదని జగన్ కు ఎవరో చెప్పారని, అందుకే ఆయన ఈ నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వాస్తు కోసం ఇల్లు ఖాళీ చేస్తే పరువు నష్టం గనుక.. విజయవాడలోనే తన నివాసం ఉండేందుకు ఓ ఇల్లు నిర్మించుకుని అక్కడకు షిఫ్ట్ కావడానికి జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబునాయుడు, కేసీఆర్ లకు పట్టినట్లే వాస్తు, జాతక గ్రహాల ప్రభావం గురించి జగన్ కు బాగా నమ్మకాలు ముదిరినట్లు కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*