వంద కంపెనీలు వందల కోట్లపెట్టుబడి



Want create site? Find Free WordPress Themes and plugins.
       నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వరద పారుతోంది. భారీ వర్షాలతో వరదలు పోటెత్తినట్లే..ఇప్పుడు ఆంధ్రుల నగరి అమరావతి వైపు పెట్టుబడి దారులు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు పుష్కల అవకాశాలున్నాయి. అందుకే సి.ఎం చంద్రబాబునాయుడు ఆ రంగం పైనా తన దృష్టి కేంద్రీకరించారు. వంద కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఆక్వా, పండ్లు, కూరగాయలు, డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడమే ఇందుకు కారణం. మొత్తం 
       100 కంపెనీలు ముందుకు రాగా వాటిలో నాలుగైదు సంస్థలు రూ.40 కోట్ల చొప్పున పెట్టుబడులు పెడుతున్నాయి. మరో 30 సంస్థలు రూ.10 కోట్ల చొప్పున, మిగతావి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఈ వంద కంపెనీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టమాటా ప్రాసెసింగ్‌, కొబ్బరి ఉత్పత్తుల తయారీ వంటి యూనిట్లలో పెట్టుబడులు పెట్టనున్నాయి.
        టమాటాల ధర ఒక్కోసారి రూ.100 కు పలికిన సంగతి తెలిసిందే. మరికొన్ని సందర్భాల్లో కిలో అర్ధరూపాయకి కొనడం లేదు. ఇంకొన్ని సార్లు పశువుల కోసం టమోటాలను రోడ్డున పారబోసిన ఉదంతాలు చాలానే. అందుకే టమోటా పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సిద్దమయ్యారు సి.ఎం. 
       పారిశ్రామికవేత్తలకు అవసరమైన పరిజ్ఞానం అందించేందుకు జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పెసైస్‌ రీసెర్చ్‌, కోకోనట్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు, మేనేజ్‌ వంటి 23 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాన భాగస్వాములుగా ఎంపిక వారు తమ సలహాలు, సూచనలు చేస్తారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటే సరిపోతోంది. కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులు బాగా అందుబాటులో ఉన్నా..వాటికి సరైన వ్యాపారం లేని సంగతి తెలిసిందే. ఇక మీదట అలా కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*