బాలయ్య చేతులమీదుగా గరుడవేగ ట్రైలర్



Want create site? Find Free WordPress Themes and plugins.
              యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన సినిమా గరుడవేగ. చానాళ్ల తర్వాత మంచి సినిమాలో నటించిన ఫీలింగ్ వచ్చిందని రాజశేఖర్ అంటున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గరుడ వేగ ట్రైలర్‌ను నందమూరి బాలయ్య విడుదల చేయనున్నాడట. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. మంగళవారం సాయంత్రం 8 గంటలకు బాలయ్య ఈ ట్రైలర్‌ను  బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ కాంప్లెక్స్‌ లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. గరుడవేగ’ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కానీ ప్రచారం మాత్రం హాలీవుడ్‌ స్థాయిలో ఉందని చెబుతున్నారు. ‘నక్షత్ర తాబేళ్లను కాపాడే’ నేపథ్యంలో సాగే కథ ఇది. 
           ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కు ఇది ప్లస్ పాయింట్ మారే వీలుంది. ఇంకా ఈ సినిమాలో పూజాకుమార్‌, శ్రద్ధాదాస్‌, సంజయ్‌రెడ్డి, అలీ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ శృంగార తార సన్నీలియెన్ స్పెషల్ సాంగ్ లో తన అందాల షో చూపించనుంది.  శ్రీచరణ్‌ పాకాల బాణీలు అందించగా… ఆర్కే ఫిల్మ్స్‌ సంస్థ రూ.25 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*