ట్రంప్ ను దింపితే 10 మిలియన్ డాలర్ల బహుమతి



Want create site? Find Free WordPress Themes and plugins.
      అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను దింపేసే ఆలోచన ఉంటే చెప్పండి. మీకు 10 మిలియన్ డాలర్లు బహుమతిగా అందిస్తానని ప్రముఖ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు ఇచ్చిన ప్రకటన ఇప్పుడు అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హస్ట్‌లర్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు లారీ ఫ్లింట్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఈ ప్రకటన ఇచ్చాడు. ట్రంప్ నుంచి తాను కోట్లాది రూపాయలను కోరడం లేదని… కేవలం ఆయనను పదవి నుంచి తప్పించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
        అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనేది ఆయన ఆరోపణ. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్ష పదవికి అర్హుడు కాదని నిరూపించుకున్నాడని విమర్శించాడు. ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు అందరూ సహకరించాలని కోరడం విశేషం. ట్రంప్‌నకు అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదని, మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కేమేను దుర్భాషలాడారని ప్రస్తావించాడు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ట్రంప్ కే  చెల్లిందని మండిపడ్డారు. చార్లోట్టీస్‌విల్లే అల్లర్ల విషయంలోనూ డొనాల్డ్ ట్రంప్ సరిగా స్పందించలేదని, అణు యుద్ధాన్ని ఆయన కోరుకుంటున్నాడని లారీ ఫ్లింట్ ఆరోపించాడు. 
       వాషింగ్టన్ పత్రికలో వచ్చిన ఈ ప్రకటనను ఫాక్స్ బిజినెస్ టీవీ యాంకర్ లిజ్ క్లామన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో మరింతగా ప్రచారానికి నోచుకుంది. ఆ తర్వాత ఫ్లింట్ కూడా తన ట్విట్టర్‌లో పెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు నేతల అక్రమాలను లారీ ఫ్లింట్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడోనన్న ఉత్కంఠ నెలకుంది. 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*