వైవి సుబ్బారెడ్డికి చేదు అనుభవం



Want create site? Find Free WordPress Themes and plugins.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి ఒంగోలులో చేదు అనుభవం ఎదురైంది. ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనతో పాటు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో సంతకం పెట్టించారు. కూలీలతోనే ఉపాధి పనులు చేయించాలి. కానీ పొక్లైయిన్ తో ఏపీలో ఆ పనులు చేయిస్తున్నారనేది వారి ఆరోపణ. ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్రం వెంటనే ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా ఆపేసింది. ఫలితంగా కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. 
                    తమకు రావాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడంలేదని అడిగితే కేంద్రం నుంచి వచ్చిన సమాధానంతో బిత్తరపోవడం ఏపీ అధికారులది అయింది. మీ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. మీ రాష్ట్ర ఎంపీలే లేఖలు రాశారు. అందుకే నిధుల విడుదలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న సిఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని సంప్రదించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. 
                     ఈ సంగతి అంతా తెలుసుకున్న ఉపాధి హామీ కూలీలు వైకాపా ఎంపీలు వైవిసుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిల పై నిప్పులు చెరుగుతున్నారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం రానే వచ్చింది. ఒంగోలులో సభలో మాట్లాడుతున్న వైవి సుబ్బారెడ్డి వద్దకు ప్లకార్డులు పట్టుకుని మరీ కూలీలు వచ్చారు. మా పొట్ట కొట్టేందుకు మీకు మనసు ఎలా ఒప్పిందంటూ నిలదీశారు. దీంతో వైవి సుబ్బారెడ్డి వారికి సర్దిచెప్పే పని చేశారు. ఇంకోవైపు వైకాపా నేతలు కూలీలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి వారికి సర్ది చెప్పారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*