జగన్ ఏం చేసినా సి.ఎం కాలేరన్న వైకాపా ఎంపీ  



Want create site? Find Free WordPress Themes and plugins.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రపై ఆ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం కాలేరని జోస్యం చెప్పారామె. అసలు ప్రత్యేక హోదా కోసం పోరాటమే పెద్ద జోక్ అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పారు. అసలు కేంద్రం హోదా అనే సంగతిని పక్కన పెట్టిన సంగతి జగన్ కే కాదు.. జనాలందరికీ తెలుసునన్నారు. ఇలాంటి సమయంలో కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండి.. ఇప్పుడు హోదా కోసం ఉద్యమం చేయడం ఏంటని ప్రశ్నించిందా ఎంపీ. 
                      ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని మరోసారి జగన్ అనంతపురం యువభేరి సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. అసలు వారంతా రాజీనామా చేసినప్పుడు తాను స్పందిస్తానన్నారు గీత. ప్రత్యేక హోదాపేరుతో ప్రజలను మభ్య పెట్టడానికే జగన్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అసలు హోదా రాదని తెలిసి పోరాటం చేయడమే దండగ అన్నారు. వైజాగ్ కు స్పెషల్ రైల్వే జోన్ కోసం పోరాడుతున్నామని, తప్పకుండా వస్తుందని ఏంపీ గీత ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయం పై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నామని గీత అన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోడీకి, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రైల్వేజోన్ పై వినతి పత్రాలిచ్చి ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారామె. 
                     నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతలు వైసీపీ పక్షాన గెలిచినా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎంపీలు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి. జగన్ పార్టీ నుంచి గెలిచిన 9 మంది ఎంపీల్లో ఇద్దరు పార్టీ మారగా.. మరో ఏడుగురు మాత్రమే పార్టీలో మిగిలారు. వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఆయనేమన్నా పార్టీ మారుతున్నారా అనే చర్చ సాగింది. తనతోపాటు మరో ఎంపీని తీసుకువచ్చేందుకు అమిత్ షాతో ఆయన మాట్లాడరంటారు. విషయం ఏమైందో తెలియదు గానీ… మేకపాటి తిరిగి వైకాపాలో క్రియాశీలకం అవుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*