డైలమా వదిలితే.. మెట్రో చిటికెలో పని!



Want create site? Find Free WordPress Themes and plugins.

అమరావతి నగరానికి మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలా? లైట్ మెట్రో రైలు వ్యవస్థ సరిపోతుందా? ఈ విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోవడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి మెట్రో రైలు వ్యవస్థ అనేది లాభాలు ఆర్జించే అవకాశమే లేదని.. భారతీయ మెట్రో రైల్ పితామహుడు శ్రీధరన్ కూడా చాలా సందర్భాల్లో చెబుతుంటారు. ఆయన అమరావతి మెట్రో రైల్ కు కన్సల్టెంటు కూడా. నిజానికి బెజవాడ అమరావతి గుంటూరు నగరాలను అనుసందానం చేస్తూ ఈ మెట్రో వ్యవస్థను ఏర్పాటు చేసినా కూడా.. లైట్ మెట్రో సరిపోతుందనేది ప్రభుత్వం అంచనాగా ఉంది. అయితే శ్రీధరన్ సహజంగానే మెట్రోను సమర్థిస్తున్న వ్యక్తి ఆ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోంది.

మెట్రో రైల్ అనేది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి.. చాలా సరళమైన ఉపయోగకరమైన వ్యవస్థగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి నగరాన్ని ప్లాన్ చేసిన తర్వాత.. అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శ్రద్ధ, చొరవతో.. ఈ మెట్రో రైలు ప్రయత్నాలు పట్టాలెక్కాయి. ఢిల్లీ మెట్రోను సఫలం చేసిన శ్రీధరన్ నే సలహాదారుగానూ పెట్టుకున్నారు.  మొత్తం ఆరువేల కోట్ల పైచిలుకు అంచనాలతో సగం డబ్బు కేంద్ర రాష్ట్రం కలిసి భరించేలా.. సగం డబ్బు అప్పులు తెచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పు పుట్టించే ప్రయత్నాలు రకరకాల కారణాల వల్ల ముందుకు సాగలేదు.

ఈలోగా కేంద్రం మెట్రో రైల్ అనుమతులకు సంబంధించి.. నిబంధనల్ని మార్చేసింది. ఆమేరకు రాబడి శాతం ప్రమాణాలకంటె తక్కువగా ఉన్న అమరావతి మెట్రోకు అనుమతి ఆగిపోయింది. ఈ నేపథ్యంతోపాటు,, ప్రాక్టికల్ గా ఫీజిబిలిటీ లెక్కలు వేసుకుని.. రకరకాల విదేశీ కంపెనీల అధ్యయనాల తరువాత.. ఏపీ కొత్త రాజధానికి లైట్ మెట్రో అయితే సరిపోతుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

నిజానికి లైట్ మెట్రోకు అనుకూలంగా వారు నిర్ణయం తీసుకుంటే.. చిటికెలో వ్యవహారం తేలిపోతుంది. దీనికి మొత్తం కలిపి 4 వేల కోట్ల కంటె ఎక్కువ ఖర్చయ్యే అవకాశం లేదు. విదేశీ కంపెనీలు సగానికి పైగా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. కేంద్రం అనుమతులకు ఇబ్బంది ఉండదు. కాకపోతే.. శ్రీధరన్ అండ్ కో మెట్రోను సపోర్ట్ చేస్తున్నారు కదాని.. ప్రభుత్వం సంశయిస్తోంది. కానీ.. త్వరగా తెమిల్చి లైట్ మెట్రోకు అనుకూలంగా నిర్ణయానికి వస్తే.. కనీసం పనులు త్వరగా మొదలవుతాయని.. త్వరగా ఒక కొలిక్కి తెస్తే ప్రభుత్వానికి ప్రతిష్ట పెరుగుతుందని పలువురు అంటున్నారు

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*