రెండుసార్లు పెళ్లి, రెండు సార్లు రిసెప్పన్



Want create site? Find Free WordPress Themes and plugins.
అక్కినేని నాగచైతన్య, సమంత జంట వివాహం అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు, ప్రముఖుల మధ్య గోవాలో జరిగింది. రెండు సార్లు వారి పెళ్లి జరగగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలను పాటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిసెప్షన్ రెండు సార్లు జరుగుతుందట. నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ లో తొలి రిసెప్పెన్ జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి నాగచైతన్య, సమంతల పెళ్లి రిసెప్షన్‌ను ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేశాడు. ఏర్పాట్లు మొదలయ్యాయి. 
         కానీ దాని కంటే ముందే నాగచైతన్య తల్లి లక్ష్మీ చెన్నైలో భారీగా రిస్పెన్సన్ ఇవ్వనున్నారు. నాగార్జున మొదటి భార్య లక్ష్మీ. ప్రముఖ నిర్మాత, దివంగత రామానాయుడు కూతురు, వెంకటేష్ సోదరినే లక్ష్మీ. ఆమె తన కొడుకు కోడళ్లను అక్కడకు తీసుకెళ్లి మరో రిసెప్షన్ చేయాలని భావిస్తున్నారట. ఈ వేడుకలకు దగ్గుబాటి బంధు గణం అంతా హజరయ్యేలా చూస్తున్నారామె. దీంతో రెండు సార్లు పెళ్లి, రెండు సార్లు రిసెప్షన్ చేసుకున్న జంటగా చైతూ సమంత జంట మరో రికార్డు క్రియేట్ చేస్తున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*