చిగురిస్తున్న టీడీపీ-టీఆర్ఎస్ పొత్తుల ఆశలు



Want create site? Find Free WordPress Themes and plugins.
రానున్న ఎన్నికల్లో టీడీపీ- టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశముంది. గులాబీ నేతల మాటల ద్వారానే ఈ విషయం బయటకు వస్తోంది. ముందుగా టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ విషయాన్ని లీక్ చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పొత్తులు అవసరమనే ఆలోచనతో ముందుకు వెళుతోంది టీఆర్ఎస్. తెలంగాణ సి.ఎం కేసీఆర్ నే కాదు.. చాలా మంది మంత్రులు టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లే. ఇప్పుడు పార్టీలో కేసీఆర్ తర్వాత అంత పేరు ఉన్న నేత తుమ్మల నాగేశ్వరావు. ఆయన మొన్నటి వరకు టీడీపీలో ఉన్న వారే. ఇప్పుడు ఆయనే పొత్తుల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. ఇప్పటి వరకు పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. మాట్లాడమని కేసీఆర్ ఆదేశిస్తే సి.ఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు తాను సిద్దమని చెప్పారు తుమ్మల. 
                 పొత్తుల లెక్కలు తేల్చేందుకు తాను రెడీగా ఉన్నట్లు చెప్పారు. అసలు పొత్తులు ఉండవనే మాటను పక్కన పెట్టి తాను వెళ్లి మాట్లాడతానని చెప్పడంతో అంతర్గతంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ-టీఆర్ఎస్ లు కలిసి పోటీ చేశాయి. ఫలితాలు రాకుండానే ఆ రెండు పార్టీల మధ్య వ్యవహారం బెడిసి కొట్టింది. ఫలితంగా కేసీఆర్ తనదైన దారిలో వెళ్లారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ బలం తగ్గుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ఎలాగైనా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలంటే టీడీపీతో పొత్తు మంచిదనే అభిప్రాయంలో ఉన్నారట కేసీఆర్. అందుకే ఈ అంశం ప్రచారానికి వచ్చిందంటున్నారు. 
                    కానీ టీఆర్ఎస్ తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి. తాము కాంగ్రెస్ తో వెళితే మంచిదని చెబుతున్నారు. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. ఆ పార్టీతో పొత్తు వద్దే వద్దు అంటున్నారట మరోవైపు చంద్రబాబు. దీంతో ఎలాంటి రాజకీయ ఎత్తులు పడతాయోనన్న ఉత్కంఠ నెలకుంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*