నా బయోపిక్ వద్దంటున్న టబు



Want create site? Find Free WordPress Themes and plugins.
నా జీవితం గురించి అందరికీ చెప్పాలనుకోవడం లేదు. అందుకే బయోపిక్ పై ఆసక్తి లేదన్నారు ప్రముఖ నటీ టబు. తన గురించి బయట అనేక పుకార్లు వస్తుంటాయి. వాటిని నిజమని చాలా మంది నమ్ముతారు. అందుకే అసలు ఆటోబయోగ్రఫీలు, బయోపిక్‌లు వద్దన్నారామె. అలా చెప్పడం తనకు ఇష్టం లేదంటోంది. చెప్పదల్చుకుంటే పూర్తిగా అన్ని విషయాలు చెప్పాలి. అది చెబితే చాలా ఇబ్బందులు వస్తాయి. సగం సగం చెప్పే బదులు అసలు మౌనంగా ఉంటేనే మంచిదన్నారు టబూ. ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా టబు మీడియాతో మాట్లాడారు.
                         టబు నటించిన ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరో కీలక పాత్ర పోషించారు. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్ ను సజావుగా కొనసాగిస్తోంది టబూ.
                       హైదరాబాద్ కు చెందిన టబూ ప్రముఖ నటి షబానా అజ్మీకి మేనకోడలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో తాతయ్యల వద్ద పెరిగింది. హైదరాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్ లోనే చదువుకుంది. కూలీ నెంబర్-1తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టబు… నాగార్జునతో ఆవిడా మా ఆవిడే, నిన్నే పెళ్లాడుతాలో నటించింది. సిసింద్రీలోను ఎంట్రీ ఇచ్చింది. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, పాండురంగడు. చిరుతో అందరివాడు సినిమాలోను ఆడిపాడింది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*