రాజుగారి గది-2 సినిమా సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.25/5
నటీ నటులు : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, అభినయ, నందు తదితరులు
దర్శకత్వం : ఓంకార్
నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, నిరంజన్ రెడ్డి
సంగీతం : ఎస్.తమన్
పరిచయ వ్యాక్యాలు…
రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు ఓంకార్. తన షోలతో బుల్లితెర మీద ఆకట్టుకున్న ఓంకార్ పెద్ద తెర మీద ఎలా చేస్తాడో అన్న ఉత్కంఠను అధిమించాడు. తొలి సినిమా బాగానే ఆడటంతో రెండోసారి హర్రర్ అంశాన్నే ఎంచుకున్నాడు. హీరో నాగార్జున అసలు ఈ సినిమాలో నటించడం ఒక ప్రయోగమైతే… నాగార్జున కోడలు సమంత ఈ ప్రాజెక్టులోకి రావడం మరో విశేషం. కోడలుగా తమ ఇంట అడుగుపెట్టిన తర్వాత సమంత సినిమా విడుదల కావడంతో నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నాడు. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా రాజు గారి గది 2 తీశారు. ఓంకార్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన తీరు ఎలా ఉంది. జనాలను ఆకట్టుకుంటుందా.. లేక భయపెట్టి.. థియేటర్ కు రాకుండా చేస్తుందా అనేది చూద్దాం…
కథలోకి వెళితే…
సినిమా అంతా కథ చుట్టూరానే తిరుగుతోంది. హీరోయిజం అనే ఆలోచనే రాదు. అభినయానికి మంచి అవకాశం. అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్)లు మంచి ఫ్రెండ్స్. వారంతా కలిసి విశాఖపట్నం బీచ్ లోని రాజుగారి బంగ్లాను కొనుగోలు చేశారు. ఒక రిసార్ట్ ను అందులో మొదలు పెట్టారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (శీరత్ కపూర్) ను కిశోర్, ప్రవీణ్ లు ప్రేమిస్తారు. ఆమెను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా వారికి అసలు సంగతి తెలుస్తోంది. ఆ రిసార్ట్ లో ఓ దెయ్యం తిరుగుతుందని వారికి అర్థమవుతోంది. చాలా భయపడతారు. అందుకు విరుగుడుగా ఏం చేయాలనే ఆలోచనతో ఓ చర్చి ఫాదర్ ను కలుస్తారు. 
                 దెబ్బకు దెయ్యం వదిలేందుకు ఏం చేయాలో చెప్పాలని కోరారు. ఆయన ఇచ్చిన సలహాతో రుద్ర ( నాగార్జున) అనే వ్యక్తిని ఆశ్రయిస్తారు వాళ్లు. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు. వారి పరిస్థితి ఏంటనే విషయాన్ని బాగా కనిపెట్టగలడు రుద్ర. దానికి సైన్స్ ను జోడిస్తాడు. ఇటు సైన్స్, అటు  పాత ఆచారాలు, నమ్మకాలు, పద్దతులను పాటిస్తుంటాడు. వారి కోరిక మేరకు రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ అక్కడ తిరుగుతుందని గ్రహిస్తాడు. తన సందేహాలను తీర్చుకునేందుకు ఆత్మ రూపంలో అమృత తిరుగుతుందని చెబుతాడు. అసలు ఆ ఆత్మ ఎవరిది. ఎందుకు చనిపోయింది..? అమృతకు ఏం కావాలి… రుద్ర అమృతకు సాయం చేశాడా లేదా.. ఒకవేళ సాయం చేస్తే .. ఎలాంటి సాయం అన్నదే కథ..
నటన ఎలా ఉందంటే…
ప్రయోగాలకు వెరవని నాగ్ ఇందులోను పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకునే పాత్రలో నాగార్జున నటన బాగుంది. అమృత, రుద్ర పాత్రలు వచ్చే సీన్స్ మళ్లీ మళ్లీ చూాడాలనిపిస్తోంది. ఈ ఇద్దరి నటన బాగుంది. సమంత అందంగా ఆకట్టుకోవడమే కాక.. దెయ్యంగాను భయపెట్టింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన చాలా భావోద్వేగం కలిగిస్తోంది. ఇక శీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేదు. అయినా గ్లామర్ తో ఆకట్టుకుంది. మరోవైపు వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు తాము భయపడుతూనే నవ్వించిన తీరు అమోఘం. అభినయ చానాళ్ల తర్వాత ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి అభినయ నటించిన తీరుకు చప్పట్లు మారుమోగుతాయి. 
సాంకేతికాంశాలు…
దర్శకుడు ఓంకార్ మరోసారి తన సత్తా చాటాడు. తాను ఎన్నుకున్న ప్రకారం సినిమా తీసి మెప్పించాడు. చివరలో నాగార్జున వంటి వారు ఓంకార్ ను గట్టిగా అరిచారనే ప్రచారం ముందే వచ్చింది. క్లైమాక్స్ సీన్స్ లో నాగార్జున అంతటి వారిని ఇబ్బంది పెట్టారంటారు. ఏం చేసినా సినిమా కోసమే చేశాడు. అయినా బాగొచ్చిందని నాగ్ ఓంకార్ కు కితాబునిచ్చాడు. నాగార్జున, సమంత లాంటి మంచి నటులు ఉన్నా… కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం బాగుంది. ఓంకార్ తీసుకున్న కోణం అద్భుతం. తెలుగు వాసనకు తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కించాడు. గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. తమన్ సంగీతం హైలెట్ అని చెప్పాలి. పాటలు లేకపోయినా బిట్స్ సాంగ్స్  అదరగొట్టాయి. దివాకరన్ సినిమాటోగ్రఫి హర్రర్ సినిమాకు కావాల్సిన అంశాలను తీసుకువచ్చింది. పీవీపీ సినిమా నిర్మాణలు విలువలు మరోసారి సినిమాలో కనపడ్డాయి. ఖర్చుకు ఎక్కడా వారు వెనక్కు తగ్గలేదు. 
ప్లస్ పాయింట్స్..
+ నాగార్జున, సమంతల నటన
+ క్లైమాక్స్
+ తమన్ సంగీతం
+ తెలుగు నేటివిటీ
మైనస్ పాయింట్స్…
– ఫస్టాప్ కొద్దిగా బోర్
– పాటలు లేకపోవడం
– శీరత్ కపూర్ పాత్ర
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*