జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా 



Want create site? Find Free WordPress Themes and plugins.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనుమతిపై జరిగిన విచారణ ఈనెల 20కు వాయిదా పడింది. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఈ పిటిషన్ విచారించింది. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో తనను అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఆరు నెలల పాటు సాగే యాత్రలో భాగంగా మూడు వేల కిలోమీటర్ల దూరం యాత్ర చేయనున్నట్లు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 
                   ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగే పాదయాత్రలో విపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకుంటానని ప్రస్తావించారు. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. జగన్ పిటిషన్ పై మరోవైపు సి.బి.ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసు నుంచి తమను తొలగించాలన్న జగన్, విజయసాయిరెడ్డిల పిటిషన్ల పై సాగిన విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేయడంతో ఉత్కంఠ నెలకుంది. వాస్తవంగా శుక్రవారం పాదయాత్ర అనుమతి పై తీర్పు వస్తుందని అంతా భావించారు. కానీ వాయిదా పడటంతో ఏం జరుగుతుందోనన్న చర్చకు తెరపడలేదు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*