వర్మకు వార్మింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే అనిత



Want create site? Find Free WordPress Themes and plugins.
రోజాతో పెట్టుకుంది అనిత. చివరకు సభ నుంచి సస్పెండ్ అయ్యేవరకు వదల్లేదు. ఇప్పుడు పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత వివాదస్పద చిత్రాల దర్శకుడు వర్మ పై పడింది. హెచ్చరికలు చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రాం గోపాల్ వర్మ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. రోజాతోపాటు.. ప్రకాష్ రాజ్ తదితరులను పెట్టి సినిమా తీస్తున్నాడాయన. ఇందులో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తే అంతు తేలుస్తామని హెచ్చరించారు అనిత. ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్మ పై కామెంట్లు చేయడంతో సినిమాకు హైప్ వచ్చింది. ఇప్పుడు అనిత తోడు కావడంతో సినిమాకు మంచి ప్రచారం వస్తోంది. 
                    అన్న ఎన్టీఆర్‌ మహానుభావుడు. ఆయన పేద ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. ఎన్టీఆర్‌ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు. వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించొద్దని, రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే, వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తున్నారని అనిత ఆరోపించారు. మరణించిన ఎన్టీఆర్‌ పైన వైసీపీ నేతలు సినిమా తియ్యాలనుకుంటే, బతికున్న జగన్‌ పై కూడా సినిమా తీసేవాళ్లు ఉన్నారని ఆమె పరోక్షంగా తెలిపారు. 
                   రాబోయే ఎన్నికల్లో గెలుపు కీలకం కావడంతో… సినిమాలను తీసి ప్రజలను ఆకట్టుకునే పని చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి వైకాపా నేత కావడమే అనిత ఆరోపణలకు కారణం. ఆ సినిమాలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకుంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*