కోర్టు కేసే భాజపాకు రక్షణ కవచం!



Want create site? Find Free WordPress Themes and plugins.

అమిత్ షా కొడుకు జే షా చేసే వ్యాపారం కాషాయ పాలన మొదలైన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఏకంగా 16వేల రెట్ల టర్నోవర్ కు చేరుకోవడం అనేది ఇప్పుడు కమలనాధుల అవినీతి బాగోతలకు సంబంధించి దేశవ్యాప్త చర్చ. దీనిపై ఎక్కడికక్కడ తాము నిజాయితీ పరులమే అని చాటుకోవడానికి భాజపా సీనియర్ నేతలంతా రకరకాల ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంలో వైర్ అనే వెబ్ సైట్ కథనాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా కుమారుడు జే షా .. వంద కోట్లకు పరువునష్టం దావా కూడా వేశారు. సరిగ్గా ఈ పరిణామాన్నే భాజపా తమ పరువు పోకుండా ఒక రక్షణ కవచంలాగా వాడుకుంటోంది.

ఒక రకంగా.. జే షా మీద వచ్చిన కథనాలను పట్టుకుని అమిత్ షాను తద్వారా మోడీని కూడా ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్ పాచిక పారేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. వారికోరిక అమిత్ షా సై అనేస్తున్నారు. ఈ విషయంలో విచారణ జరపాలని కాంగ్రెస్ కోరుతోంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయల పరువునష్టం దావాతో కోర్టును ఆశ్రయించిన తన కొడుకు విచారణ జరపాల్సిందిగా కోర్టునే కోరుతున్నాడని.. ఆ విచారణకు కాంగ్రెస్ సహకరించాలని అమిత్ షా సవాలు విసురుతున్నారు. అవినీతికి సంబంధించి ఆధారాలుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టుకు సమర్పించాలని కూడా సవాలు విసురుతున్నారు.

అమిత్ ఇంకా ఎదురుదాడికి దిగుతూ కాంగ్రెస్ పార్టీనే ఇరుకున పెడుతున్నారు.

కాంగ్రెస్ మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్క ఆరోపణ గురించి అయినా.. అది అసత్యం అని పేర్కొంటూ వంద కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసిందా? లేదు కదా.. తాము చేసిన అవినీతి వారికి తెలుసు గనుక.. వారు ఎన్నడూ అలాంటి సాహసానికి పూనుకోలేదు. మా నిజాయితీ మాకు తెలుసు గనుక.. మేం పరువునష్టం దావా వేసి మా వ్యవహారాలపై విచారణ సాగాలని కోర్టునేకోరుతున్నాం. అవినీతి నిజమే అయితే కోర్టు ముందు పెట్టండి.. అని అమిత్ షా విసురుతున్న సవాలుకు కాంగ్రెస్ నుంచి స్పందన ఉండడం లేదు.

వైర్ అనే వెబ్ సైట్ వేసిన కథనం సంగతి తర్వాత.. దాన్ని వాడుకుని ఏకంగా భాజపా దిగ్గజాలను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయాలని అనుకున్న కాంగ్రెస్ పార్టీ చివరికి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా తయారైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*