మేకపాటిని కూల్ చేసిన జగన్



Want create site? Find Free WordPress Themes and plugins.
మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైకాపా ఎంపీ. ఆ పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత. కొన్నాళ్లుగా ఆయన సైలెంట్ గా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొనడం లేదు. జగన్ తోను అంటీ ముట్టనట్లు వ్యవహరించాడు. పార్టీలో ఆయనకు బదులు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల హవా సాగడమే ఇందుకు కారణం. ఏపీకి ప్రత్యేక హోదా పై కేంద్ర వైఖరికి నిరసనగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని జగన్ ముందుగానే ప్రకటించారు. తొమ్మిది మంది ఎంపీలకు గాను.. ఇద్దరు పార్టీ మారారు. మిగిలిన ఏడుగురులో సగం మంది రాజీనామాలకు సిద్దంగా లేమని చెప్పేశారట. రాజీనామాల వల్ల ఒరిగేది ఏమైనా ఉందా. అసలు కేంద్రం పట్టించుకుంటుందా అని అడిగారు. దీంతో జగన్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 
                  జగన్ కు ఎదురు తిరిగిన వారిలో మేకపాటి ముందు వరుసలో ఉన్నాడంటున్నారు. ఈ మధ్య బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోను మేకపాటి మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకే ఇక లాభం లేదనుకుని మేకపాటిని పిలిచి మాట్లాడారు జగన్. ఆయన్ను కూల్ చేశారు. పార్టీలో మీకు వచ్చిన ఇబ్బందులు తెలుసు. కాస్తంత ఓపిక పట్టండి. అంతా సర్దుకుంటోందని చెప్పారాయన. ఫలితంగా మేకపాటి సెట్ అయ్యారంటున్నారు. 
                  సాధారణంగా తనను వ్యతిరేకించే వారిని వదిలి పెట్టే రకం కాదు జగన్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో సీనియర్లను వదులుకుంటే అసలుకే మోసం వస్తుందని భావిస్తున్నాడు. అందుకే అందరినీ కలుపుకుపోయే పని చేస్తున్నాడు. మేకపాటిని అలానే పిలిచి మాట్లాడారు జగన్. అనంతపురం యువభేరి సభలో తమ ఎంపీలు రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పగానే.. మేకపాటి స్పందించారు. అవును. మేము రాజీనామాలకు సిద్దమని చెప్పారు. కానీ గతంలో ఆ మాట అనలేదు మేకపాటి. మార్పు వచ్చిన ఫలితంగానే ఈ మాటను మేకపాటి చెప్పారంటున్నారు.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*